స్పైడర్ డోస్ పెంచి తీరాల్సిందే

నిజం మాట్లాడుకోవాలంటే, స్పైడర్ ప్రారంభించినపుడు వచ్చిన బజ్ ఇటీవల కాలంలో లేదు. కారణం మరేమీ లేదు. మురుగదాస్ డైరక్టర్ ఠాగూర్ మధు లాంటి నిర్మాత ప్రచారం మీద కన్నా సినిమా ఫినిష్ చేయడం మీదనే…

నిజం మాట్లాడుకోవాలంటే, స్పైడర్ ప్రారంభించినపుడు వచ్చిన బజ్ ఇటీవల కాలంలో లేదు. కారణం మరేమీ లేదు. మురుగదాస్ డైరక్టర్ ఠాగూర్ మధు లాంటి నిర్మాత ప్రచారం మీద కన్నా సినిమా ఫినిష్ చేయడం మీదనే దృష్టి పెట్టారు. పైగా 125కోట్ల సినిమా కావడంతో ఆ టెన్షన్లే సరిపోయాయి. ఆ తరువాత లుక్, టీజర్ సాంగ్ విడుదల చేసారు, మంచి హిట్ లే తెచ్చుకున్నాయి కానీ, చాలినంత బజ్ పెంచలేకపోయాయి. మురుగదాస్ మీడియా మీట్ పెట్టారు కానీ ఇవేవీ చాలవు

ఇప్పుడు నిన్నటి నుంచి ఒక్కొక్కటిగా స్టిల్స్ బయటకు వస్తున్నాయి. రెగ్యులర్ ఫార్మాట్ అయినా మహేష్-రకుల్ కాంబినేషన్ స్టిల్ జనాలను ఆకట్టుకుంది. ఇది గమనించాలి. సినిమాలోని జేమ్స్ బాండ్ ఫాక్టర్ ను మాత్రమే జనాల మందుకు తీసుకువస్తే, కామన్ ఆడియన్స్ ముందు నడవదు.

ఫ్యాన్స్ సంగతి ఎలా వున్నా, కామన్ ఆడియన్స్ సంగతి చూడాలి. వాళ్ల దృష్టి పడేలాంటి స్టిల్స్ బయటకు రావాలి. వాళ్లకు నచ్చే సాంగ్ టీజర్లు బయటకు రావాలి. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల టైమ్ వుంది. అందువల్ల ఇఫ్పటి నుంచి సినిమాలో వున్న సరైన సరుకు బయటకు తీస్తే తప్ప, బజ్ పెరగదు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 70కోట్లకు పైగా రేట్లకు థియేటర్ రైట్స్ విక్రయించారు. ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ వుండాలి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు వుండాలి. అలా వుండాలంటే మహేష్ బాబు సినిమా అన్న పాయింట్ ఒక్కటే చాలదు. సినిమాలో ఏముందన్నది, ఏముంటుందన్నది కూడా జనాలకు చేరాలి కనీసం మూడు వారాల్లోగా.