సై..రా లో అనుష్క కూడా?

బాహుబలి తరువాత భారీ మల్టీ స్టారర్ మెగా స్టార్ సై..రా నే అనుకోవాలి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ ఇలా బహుబాషా నటులను తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న వారు కూడా చాలా వరకు…

బాహుబలి తరువాత భారీ మల్టీ స్టారర్ మెగా స్టార్ సై..రా నే అనుకోవాలి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ ఇలా బహుబాషా నటులను తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న వారు కూడా చాలా వరకు ఆయా భాషల్లో పాపులర్ నటులే.

అయితే లేటెస్ట్ గా ఈ జాబితాలో జేజెమ్మ అలియాస్ దేవసేన అలియాస్ అనుష్క పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. సై..రా లో ఓ కీలకపాత్రకు అనుష్కను సంప్రదించినట్లు, ఆమె కూడా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి వుంది.

అనుష్క చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేనట్లే. అన్నీ వార్తల్లోనే వున్నాయి. ఫినిష్ చేసిన భాగమతి సినిమా విడుదల కావాల్సి వుంది. కానీ విజువల్ ఎఫెక్ట్ ల కారణంగా లేటవుతోంది.

ఈ సినిమా నవంబర్ లో విడుదలయ్యే అవకాశం వుంది. లేదూ అంటే 2018లోనే విడుదలవుతుంది. బాహుబలితో జాతీయ స్థాయి పబ్లిసిటీ, గుర్తింపు అందుకున్న అనుష్క కూడా సైరా ప్రాజెక్టులో పార్ట్ అయితే, ఆ సినిమాకు అదనపు ఆకర్షణే అవుతుంది.