రెండు కోట్లతో అసెంబ్లీ భవనం రెడీ అయిపోతోంది. ఇది అమరావతి కొత్త అసెంబ్లీ కాదు. తెలంగాణ పాత అసెంబ్లీ భవనానికి రీప్లేస్ కాదు. భరత్ అనే నేను సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ఊహల్లోంచి ఊడిపడుతున్న అసెంబ్లీ సెట్. మహేష్ హీరోగా కొరటాల శివ ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ అసెంబ్లీ సెట్ లో కాస్త పెద్ద షెడ్యూలే వుంది. అందుకే దీన్ని అద్భుతంగా వుండేలా నిర్మిస్తున్నారు. ఇందుకోసం కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
భరత్ అనే నేను సినిమా కోసం వేస్తున్న భారీ సెట్ ఇదొక్కటే. అవసరం అయితే ఓ పాట కోసం మరో సెట్ వేస్తారు. మరి కొద్ది రోజుల్లో ఈ అసెంబ్లీ సెట్ లో షూట్ ప్రారంభమై, సుమారు ముఫై నలభై రోజుల పాటు సాగుతుంది. భరత్ అనే నేను సినిమా సంక్రాంతి విడుదలను టార్గెట్ చేసి రెడీ చేస్తున్నారు.