యంగ్ హీరోలు సాధించిన హిట్ లు అన్నీ అయితే ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు లేదా రొమాంటిక్ ఎంటర్ టైనర్లు. ఈ సంగతి గ్రహించిన వారు హిట్ లు కొడుతున్నారు. గ్రహించకుండా ఇంకా ఫైట్లు, యాక్షన్, మాస్ ఇమేజ్ కోరుకున్నవారు ఫ్లాపులతో వెనక పడుతున్నారు. నాని, శర్వా, నితిన్ ఇలా చాలా మంది యాక్షన్ సినిమాలతో ఫ్లాపులు చూసి, లవ్ సినిమాలతో హిట్ లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ విషయం సాయి ధరమ్ తేజకు కూడా తెలిసి వచ్చినట్లుంది. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి, ప్రయత్నించి బోర్లా పడ్డాడు. చేస్తున్న జవాన్ సినిమా కూడా పక్కన పడింది. దానికి రిపేర్లు జరగాలి, బయటకు రావాలి. వినాయక్ సినిమా సబ్జెక్ట్ ఏమిటో తెలియదు కానీ, వినాయక్ అంటే మాస్ సినిమానే అటెంప్ట్ చేస్తాడన్న సంగతి తెలిసిందే.
అందుకే ఆ తరువాతి కరుణాకర్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట తేజ. ఆ సినిమాలో ఒక్క ఫైట్ కూడా వుండకుండా చూడమని డైరక్టర్ కరుణాకర్ కు చెప్పనే చెప్పేసాడట. ఇన్నాళ్లకు తెలిసి వచ్చింది. లేటయినా మంచిదే.