పెద్ద సినిమాల ఓవర్ సీస్ అంటే ఒకటి, రెండు మీడియం సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ అన్నట్లు వుంది ఇఫ్పుడు రాబోయే పెద్ద సినిమాల ఓవర్ సీస్ బిజినెస్ ఒకటీ, ఒకటీ క్లోజ్ అవుతోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఆల్ మోస్ట్ 20కోట్ల రేంజ్ లో క్లోజ్ అయింది. అంతకు ముందు మహేష్ బాబు స్పైడర్, ఎన్టీఆర్ జై లవకుశ కూడా ఫినిష్ అయ్యాయి.
ఇక మిగిలిన సినిమా సంక్రాంతికి రాబోయే కొరటాల శివ -మహేష్ బాబు కాంబినేషన్ లోని భరత్ అనే నేను. ఇప్పుడు ఈ సినిమా బేరాలు కూడా స్టార్ట్ అయ్యాయి. నిర్మాత దానయ్య ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను 20కోట్లకు కోట్ చేస్తున్నారు.
ఓవర్ సీస్ లో మహేష్ బాబుకు మంచి మార్కెట్ వుంది. అలాగే కొరటాల శివకు డిటో డిటో. పైగా కొరటాల శివ ట్రాక్ రికార్డు ఫుల్ స్వింగ్ లో వుంది. అందువల్ల 20 కోట్లు ప్రైస్ అన్నది సులువుగానే సాధ్యమని నిర్మాత దానయ్య భావిస్తున్నారు. ఇప్పటికే ఎంక్వయిరీలు, ఆఫర్లు మొదలయ్యాయి. అయితే వాటిల్లో ఏది దానయ్య ఫిగర్ కు మ్యాచ్ అవుతంది అన్నది పాయింట్.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం తెలుస్తున్నది ఏమిటంటే, ఈ వీకెండ్ వేళకు ఓవర్ సీస్ డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు వున్నాయన్నది.