మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్నాడు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు చాలా వ్యవహారం నడిచింది. ముద్దు సీన్ తో ఈ సినిమా బాగానే హైలెట్ అయింది. ఇలా రిలీజ్ కు ముందే హైప్ తెచ్చుకున్న అర్జున్ రెడ్డి సినిమాను లెక్కప్రకారం శర్వానంద్ చేయాలి. కానీ అనుకోని విధంగా దేవరకొండ ఖాతాలోకి వెళ్లింది.
“ముందు ఈ కథను శర్వానంద్ కు చెప్పాను. కానీ అప్పటికే శర్వ ఫుల్ బిజీ అయిపోయాడు. దీంతో విజయ్ దేవరకొండకు వినిపించాను. నిజానికి పెళ్లిచూపులు కంటే ముందే ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ లొకేషన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని లేట్ చేశాం. అలా పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి వస్తోంది. లేదంటే ఇది పెళ్లిచూపులు కంటే ముందు రావాల్సిన సినిమా. శర్వా నుంచి దేవరకొండకు షిఫ్ట్ అవ్వడం వల్ల కథలో మార్పురాలేదు” శర్వానంద్ పై దర్శకుడు సందీప్ రెడ్డి ఇచ్చిన వివరణ ఇది.
ఇక సినిమా నిడివిపై ఉన్న అనుమానాలకు కూడా సమాధానమిచ్చాడు సందీప్ రెడ్డి. సినిమా 3 గంటల 1 నిమిషం 47 సెకెన్లు ఉంటుందని.. ఇలా 3 గంటల డ్యూరేషన్ పెట్టడం వల్ల “అర్జున్ రెడ్డి”కి ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నాడు. సినిమా చూసిన తర్వాత నిడివి గురించి ఎవరూ మాట్లాడుకోరని అంటున్నాడు.