పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, నిర్మాత శరత్ మరార్ ఇటీవల మళ్లీ వార్తల్లో వినిపిస్తున్నారు. పవన్ తో సినిమాలు అయిపోయాయి. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా సినిమాలు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఇప్పటికే విజయ్ సినిమా మెర్సాల్ తెలుగు హక్కులు కొన్నారు.
చిన్న సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. మరోపక్క డబ్బింగ్ సినిమాల మీద గట్టి దృష్టే పెట్టారు. శంకర్-రజనీ కాంబో సినిమా రోబో 2 సినిమా హక్కులు 70 నుంచి 80కోట్ల రేంజ్ లో ఏసియన్ సునీల్ కొనుగోలు చేసారన్నది వార్త.
కానీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు వేరుగా వున్నాయి, శరత్ మరార్, ఎఎమ్ రత్నం ఇద్దరూ కూడా ఈ తెలుగు హక్కుల ప్రాజెక్టు వెనుక వున్నారని తెలుస్తోంది.
ఎఎమ్ రత్నంకి వున్న తమిళ ఇండస్ట్రీ పరిచయాల ద్వారా, అతని భాగస్వామ్యంతో, ఏసియన్ సునీల్ ఇన్వాల్వ్ మెంట్ వుండేలా శరత్ మరార్ హక్కులు తీసుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో శరత్ మరార్ పార్ట్ నే ఎక్కువ అని వినికిడి. మొత్తానికి పవన్ కు దూరం జరిగాక, సినిమాల్లో చాలా ప్లాన్డ్ గా ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది శరత్ మరార్.