అదిగో రాజమౌళి.. ఇదిగో వార్త

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని సన్నిహితంగా గమనించేవారికే తెలిసిన కోణం ఒకటి వుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకు ఆయన కాపులకు ప్రతినిధిగా పార్టీలు చూస్తాయి. కానీ ఆయన తన కెరీర్ ను ఆద్యంతం చాలా జాగ్రత్తగా…

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని సన్నిహితంగా గమనించేవారికే తెలిసిన కోణం ఒకటి వుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకు ఆయన కాపులకు ప్రతినిధిగా పార్టీలు చూస్తాయి. కానీ ఆయన తన కెరీర్ ను ఆద్యంతం చాలా జాగ్రత్తగా ఆ ముద్ర పడకుండా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. చిరంజీవి కెరీర్ పీక్ లో వున్నపుడు ఆయనతో సినిమాలు నిర్మించిన వాళ్లల్లో అత్యథికులు టాలీవుడ్ లో కీలకమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే.

కొంత మంది కాపు కుల సన్నిహితులు ఈ విషయంలో అప్పట్లో చిరంజీవిని అడిగితే, కమ్మవారితో మంచిగా వుంటూ, వాళ్లతో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఇక్కడ బాగుంటుంది అని సమాధానం వచ్చేదని ఇప్పటికీ ఇండస్ట్రీలో అప్పటి సంగతుల తెలిసిన కొందరు ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు. అందుకే చిరు సినిమాలకు అయితే కమ్మ నిర్మాత, లేదా కమ్మ డైరక్టర్ కచ్చితంగా వుండేలా చూసుకునేవారని ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు. పైగా కాపులు మన వాళ్లు, మనం అవునన్నా, కాదన్నా మనతోనే వుంటారు. వేరే వాళ్లు మనతో వుండడం కీలకం అన్నది చిరంజీవి మనోగతం అని వారు అంటారు.

చిరంజీవిని అభిమానించి ఇండస్ట్రీలో చాలా మంది కాపుల్లో క్లియర్ అభిప్రాయం వుంది. 'ఆయన ఇండస్ట్రీలో కాపులను పెద్దగా దగ్గరకు తీసింది లేదు, చేసింది లేదు. అయినా మాకు తప్పదు' అన్నది కాపు కులానికి చెందిన పలువురు ఇండస్ట్రీ జనాల మాట. అయనకు తెలుసు, అవునన్నా, కాదన్నా, మేం చొక్కాలు చింపేసుకుని పని చేస్తాం అని అంటారు వారు.

తాజాగా సై..రా సినిమా టైటిల్ ఆవిష్కరణకు దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించడంలో కూడా ఇదే తప్ప వేరే లాజిక్ లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. పైగా ఇటీవల చిరంజీవి కొత్తగా రెడ్డి సామాజిక వర్గానికి దగ్గరవుతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితం అయ్యారు. ఆ ఫ్యామిలీ బిజినెస్ ఓపెనింగ్ కు సైతం చరణ్ ప్రత్యేకంగా వెళ్లి వచ్చారు. 200కోట్ల ప్రెస్టీజియస్ ఫ్రాజెక్టును అప్పగించారు. 

ఇలాంటి టైమ్ లో ఎప్పటిలాగే కమ్మ సామాజిక వర్గాన్ని దూరం పెట్టుకునే ఆలోచన చిరంజీవి పొరపాటున కూడా చేయరు. అందుకే ప్రత్యేకించి రాజమౌళిని ఆహ్వానించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా బాహుబలితో రాజమౌళికి వచ్చిన జాతీయ స్థాయి పేరు తక్కువేమీ కాదు. అది ఈ ఈవెంట్ ద్వారా సై..రాకు యాడ్ అవుతుంది.

అయితే రాజమౌళి అంతకన్నా తెలివైన వారు. ఆయన కూడా అజాతశతృవుగా వుండాలనుకుంటారు. అందుకే పిలవగానే వచ్చారు. అంత మాత్రం చేత రామ్ చరణ్ తో సినిమా వుంటుందని అనుకుంటే భ్రమే అన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రాజమౌళి తరువాతి సినిమాలో కచ్చితంగా కమ్మ సామాజిక వర్గ హీరోనే వుంటారన్నది బలంగా వినిపిస్తోంది. అది ఎన్టీఆర్ నా, మహేష్ నా? అఖిల్ నా అన్నది ఇప్పట్లో తెలియకపోవచ్చు. మెగా క్యాంప్ తో మాత్రం వుండకపోవచ్చని రూఢిగా ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది.