మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాకు టైమ్ వచ్చింది. ఇప్పటి దాకా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఈ రోజు చిరు బర్త్ డే సందర్భంగా టైటిల్ తో కూడిన మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నారు. సినిమాకు చాలా పేర్లు అనుకున్నారు. ఆఖరికి సై రా అన్నది ఫిక్స్ చేసారు. దానికి నరసింహారెడ్డి అన్నది ట్యాగ్ లైన్ లేదా సెకెండ్ లైన్ టైటిల్ గా ఫిక్స్ చేసారు. మరి అన్ని భాషలకు ఇదే వుంచుతారో, హిందీకి మారుస్తారో తెలియదు.
సినిమాకు ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ డైకర్టర్ అని వినవచ్చింది. కానీ అది వాస్తవం కాదు. ఎస్ ఎస్ థమన్ నే మ్యూజిక్ డైరక్టర్. సురేందర్ రెడ్డికి మాంచి అచ్చివచ్చిన మ్యూజిక్ డైరక్టర్ థమన్.
మోషన్ పోస్టర్ కు థమన్ నే మాంచి రీ రికార్డింగ్ అందించాడని బోగట్టా.
మోషన్ పోస్టర్ లో చిరంజీవి ఫోటో వుండకపోవచ్చని తెలుస్తోంది. ఓ వీరుడు కత్తి పట్టి నిల్చుంటాడు. చుట్టూ అతను దునుమాడిన శతృవుల మృతదేహాలు వుంటాయి. ఇదే మోషన్ పోస్టర్ గా తెలుస్తోంది.
అయితే ఆ వీరుడి లుక్ లో జస్ట్ క్యాజువల్ గా చిరు పోలికలు వుంటే వుండొచ్చు. మరి కొద్ది గంటల్లో ఈ మోషన్ పోస్టర్ ను దిగ్దర్శకుడు రాజమౌళి ఆవిష్కరిస్తారు.