తాప్సీ తెలుగులో సరైన బ్రేక్ రాకుండా ఇబ్బంది పడుతున్న హీరోయిన్. ఆ వ్యవహారం అలా వుంచితే, తాప్సీని జస్ట్ సినిమాకు క్రేజ్ తెచ్చుకోవడానికి, పబ్లిసిటీకి వాడుకుంటున్నారా? లేదా సినిమాలో సరైన లైన్ లెంగ్త్ లేని క్యారెక్టర్ వుంటే తాప్సీకి ఇస్తున్నారా అన్నది అనుమానంగా వుంది.
ఘాజీ సినిమాలో తాప్సీకి ఫుల్ లెంగ్త్ క్యారెక్టరే కానీ, పెద్దగా స్కోప్ వున్నది కాదు. ఇప్పుడు ఆనందో బ్రహ్మ సినిమాకూ అంతే. కానీ సినిమా అంతా తానే అన్నంతగా పబ్లిసిటీ చేసింది తాప్సీ. తెగ ప్రచారం హడావుడి ఆమే చేసింది.
సినిమా మొత్తం ఆమే కీలకం అన్నంతగా పబ్లిసిటీ చేసారు. కానీ తీరా సినిమా చూస్తే, సినిమాలో ఆమెను ఓ బొమ్మలా నిల్చో పెట్టారు. పైగా చాలా వరకు పాథటిక్ ఫేస్ తో కనిపిస్తుంది.
సినిమాకు జరుగుతున్న పబ్లిసిటీ, తాప్సీ స్టిల్స్ చూసి సినిమాకు వెళ్తే, నిరాశే మిగుల్తోంది. అయితే లక్కీగా తాప్సీ కోసం వెళ్లిన వాళ్లని షకలక శంకర్, వెన్నెల కిషోర్ ఆదుకుని అలరిస్తున్నారు. ఓ విధంగా తాప్సీ సినిమాకు జనాలను తీసుకువస్తోంది. కమెడియన్లు వాళ్లని ఎంటర్ టైన్ చేస్తున్నారు.
ఈ సినిమా విజయంతో అయినా తాప్సీకి కాస్త మంచి పాత్రలు వస్తాయో? లేక ఇలాంటి అరకొర పాత్రలే వస్తాయో? చూడాలి.