Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ డైరక్టర్ ఎక్కడ?

ఆ డైరక్టర్ ఎక్కడ?

రెండు హిట్ లు కొట్టిన డైరక్టర్ ఎక్కడ వున్నారు? అని వాకబు చేసుకోవాల్సిన పరిస్థితి వుంటుందా ఎక్కడైనా? కానీ చిత్రంగా అలాగే వుంది కళ్యాణ్ కృష్ణ గురించి జనాలు అడుగుతుంటే. ఆయన ఏమైనా చేస్తూ వుండొచ్చు. జనాలకు తెలియకుండా ఏదైనా సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ వుండి వుండొచ్చు. లేకపోవచ్చు.

కానీ తెలుగు నాట ఒక్క డైరక్టర్ కూడా ఖాళీగా లేరు. మరీ డిజాస్టర్లు ఇచ్చిన వారు తప్ప. ఇలా సినిమా అయితే అలా ఎగరేసుకుపోతున్నారు. అలాంటిది రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ ఇచ్చి ఇన్ని రోజులు అయింది. కానీ కళ్యాణ్ కృష్ణ తరువాత సినిమా ఏమిటో తెలియడం లేదు. అన్నపూర్ణ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసారు. ఆ తరువాత అఖిల్ తో కూడా సినిమా వుంటుందని వార్తలు వినవచ్చాయి. కానీ అఖిల్ వేరే సినిమా మీదకు వెళ్లిపోయాడు.

చాలా మంది నిర్మాతలు సరైన డైరక్టర్, ప్రాజెక్టు కోసం చూస్తున్నారు. మరి కళ్యాణ్ కృష్ణ పేరు ఎందుకు వినిపించడం లేదో? రారండోయ్ సినిమా మేకింగ్ విషయంలో నాగ్ అసంతృప్తికి గురయ్యాడని, ఆయన చివర్లో దగ్గరుండి నిర్మొహమాటంగా, ఎడిట్ చేసి, సినిమాను కాపాడుకున్నాడని వార్తలు వినవచ్చాయి. మరి కళ్యాణ్ కృష్ణ కెరీర్ ను ఆ వార్తలు ఏమన్నా డ్యామేజ్ చేసాయా? అన్నది అనుమానం.

అయితే, కళ్యాణ్ కృష్ణ చేద్దామన్నా హీరోలు కూడా ఎవ్వరూ ఖాళీగా వున్నట్లు కనిపించడం లేదు. ఖైదీ సినిమా తరువాత వినాయక్ సినిమానే ఇంకా ఎక్కలేదు. అందువల్ల  కళ్యాణ్ కృష్ణకు కూడా అదీ ఓ సమస్యే. ఇప్పడు ఖాళీగా వున్న డైరక్టర్ల జాబితా ఇంకా పెరుగుతోంది. వీరభద్రమ్ చౌదరి, చంద్ర మోహన్, సంపత్ నంది, హరీష్ శంకర్, కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరారు. నీలకంఠ, యేలేటి లాంటి సీనియర్లు ఎలాగూ ఇక్కడే వున్నారు. మరి కళ్యాణ్ కృష్ణ ఎప్పుడు ఈ జాబితా నుంచి బయటకు వచ్చి, సినిమా ప్రకటిస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?