ఉయ్యాలవాడే నెక్స్‌ట్‌ బాహుబలి

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో సినిమా చేయాలనేది చిరంజీవి చిరకాల కోరిక. పదేళ్ల క్రితం చేసినట్టయితే ఈ చిత్రం ఎలా తలపెట్టి వుండేవారో తెలియదు కానీ, బాహుబలితో తెలుగు సినిమా పరిధులు విస్తృతమైన నేపథ్యంలో దీనిని…

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో సినిమా చేయాలనేది చిరంజీవి చిరకాల కోరిక. పదేళ్ల క్రితం చేసినట్టయితే ఈ చిత్రం ఎలా తలపెట్టి వుండేవారో తెలియదు కానీ, బాహుబలితో తెలుగు సినిమా పరిధులు విస్తృతమైన నేపథ్యంలో దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.

బాహుబలి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అంతటి భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే చిత్రమిదే. దీనిని కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా కాస్టింగ్‌, ప్లానింగ్‌ చేస్తున్నారు.

సురేందర్‌ రెడ్డికి ఇంతటి భారీ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసిన అనుభవం లేకపోయినప్పటికీ అతని సామర్ధ్యంపై నమ్మకం వుంచి విఖ్యాత సాంకేతిక నిపుణులని, ప్రసిద్ధి గాంచిన నటులని సైన్‌ చేస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాణ వ్యయం ఇప్పటికి రెండు వందల కోట్ల వరకు తేలిందని అంచనా. అది మరింత పెరగడానికి ఆస్కారం వుందని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఈ చిత్రం బెంచ్‌మార్క్‌ సృష్టించేలా వుండాలని చూస్తున్నారని సమాచారం.