కొడితే జాక్ పాటే మరి

వివేకం. టైటిల్ కాస్త క్యాచీగా లేకపోవచ్చు. కానీ ట్రయిలర్ చూస్తే దమ్మున్న సినిమా మాదిరిగా కనిపిస్తోంది. అజిత్, కాజల్ వంటి స్టార్ లు వున్న సినిమా. తెలుగులో ఏ మేరకు మార్కెట్ వుంది, ఓపెనింగ్స్…

వివేకం. టైటిల్ కాస్త క్యాచీగా లేకపోవచ్చు. కానీ ట్రయిలర్ చూస్తే దమ్మున్న సినిమా మాదిరిగా కనిపిస్తోంది. అజిత్, కాజల్ వంటి స్టార్ లు వున్న సినిమా. తెలుగులో ఏ మేరకు మార్కెట్ వుంది, ఓపెనింగ్స్ వుంటాయి అన్నవి పక్కన పెడితే, డబ్బింగ్ సినిమాలకు మంచి టాక్ వస్తే మాత్రం మన ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. సినిమా సూపర్ గా వుండి, వన్ వీక్ థియేటర్లలో వుంచగలిగితే చాలు, కలెక్షన్లు కురిపిస్తారు. గతంలో చాలా సినిమాలకు చేసింది ఇదే.

అజిత్-కాజల్ కాంబినేషన్ లో డైరక్టర్ శివ అందిస్తున్న వివేకం సినిమాకు సూర్య బ్రదర్స్ సినిమాల మాదిరిగా సూపర్ పబ్లిసిటీ లేదు. లేదూ అంటే ఓ రేంజ్ లో వుండేది వ్యవహారం.

వివేకం డబ్బింగ్ హక్కులు తీసుకున్న నిర్మాత అదృష్టం ఏమిటంటే, జస్ట్ మూడు కోట్లకేె తెలుగు థియేటర్ రైట్స్ తీసుకుని, మరి కొద్దిగా పబ్లిసిటీకి, ఇతరత్రా చార్జీలకు ఖర్చు చేస్తున్నారు. అంటే చాాలా లీస్ట్ ఖర్చుకే ఇంత పెద్ద సినిమావచ్చిందనుకోవాలి.

రెండు రాష్ట్రాల్లో అజిత్ సినిమాను నాలుగు కోట్లకు మార్కెట్ చేయడం పెద్ద కష్టం కాదు. పైగా ట్రయిలర్ చూస్తే బి సి సెంటర్లలో ఎక్కేలాగే వుంది. సినిమా జనాల్లోకి వెళ్తే జాక్ పాటే.