మొత్తానికి జై లవకుశ ఓవర్ సీస్ రైట్స్ వ్యవహారం తేలిపోయింది. ఇప్పటికే మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాల హక్కులు తీసుకున్న యుఎస్ తెలుగు సినిమాస్ సంస్థ జై లవకుశ హక్కులను 8.5 కోట్లకు అవుట్ రేట్ పద్దతిన తీసుకుంది. వాస్తవానికి గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ 7 కోట్లకు, మరో సంస్థ 7.5 కోట్లకు ఆఫర్ ఇచ్చాయి.
యుఎస్ తెలుగూస్ సంస్థ సినిమా ఆరంభంలో మంచి కోట్ ఇచ్చింది. కానీ ఇటీవల యుఎస్ ఓవర్ సీస్ మార్కెట్ లో వచ్చిన స్లంప్, ఒడిదుకుడులు అన్నీ దృష్టిలో పెట్టుకుని వెనకడుగు వేసింది.
యుఎస్ తెలుగూస్ సంస్థ తో నిర్మాత కళ్యాణ్ రామ్, ఆయన వ్యవహారాలు చూసే హరి కలిసి సాగించిన డిస్కషన్ల మేరకు 8.5 కోట్లకు అవుట్ రేట్ పద్దతిన ఫైనల్ అయింది. అంటే ఇక నష్టమూ, లాభమూ ఏదయినా బయ్యర్ దే. ఇక ఓవర్ ఫ్లోస్ లో షేర్ లాంటి లింక్ లు ఏవీ లేవు.
ఈ రోజు అగ్రిమెంట్ కుదిరినా, మంగళవారం అని అగ్రిమెంట్ సైన్ చేయలేదు. రేపు చేస్తారు.