Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పవన్ సినిమా టైటిల్ అది కాదంట

పవన్ సినిమా టైటిల్ అది కాదంట

పవన్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ పై రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. వాటిల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్నది ఒకటి వుంది. ‘రాజు వచ్చినాడు’ అన్నది టైటిల్ గా వినిపిస్తోంది.

కానీ పవన్ సినిమా యూనిట్ మాత్రం సమస్యే లేదు. అది టైటిలే కాదు అంటోంది. పవన్ 25వ సినిమా టైటిల్ ను తాము ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నామని, అందుకోసం డైరక్టర్ త్రివిక్రమ్ చాలా ఆలోచిస్తున్నారని అంటున్నారు. టైటిల్ కచ్చితంగా ఓ రేంజ్ లో వుంటుందంటున్నారు.

రాజు వచ్చినాడో అన్నది గతంలో నాగ్ చైతన్య సినిమాలో ఓ పాట మకుటం. పోయి పోయి, త్రివిక్రమ్ అలాంటి టైటిల్ ను ఎంచుకుంటారా అన్నది అనుమానం. దానికి తోడు యూనిట్ కూడా అదే అంటోంది. అందువల్ల అసలు టైటిల్ వచ్చేవరకు ఇలాంటి గ్యాసిప్ లు, ఫీలర్లు బయటకు వస్తూనే వుంటాయి. పవన్ కు త్రివిక్రమ్ కు, వాళ్ల కాంబినేషన్ కు వున్న క్రేజ్ అలాంటిది మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?