బోయపాటి శ్రీనివాస్, సీన్ తీస్తే తెరపై చించి ఆరేయాల్సిందే. డీటీఎస్ బాక్స్ లు బద్దలు కావాల్సిందే. రానా దగ్గుబాటి తన హైట్, వెయిట్ తో పాటు వాయిస్ కూడా బలంగానే వున్న హీరో. విలన్ గా బాహుబలిలో, మల్టీ షేడ్ వున్న నటుడిగా నే.రా.నే.మ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు.
ఇప్పడు ఈ కాంబినేషన్ లో సినిమా తీస్తే ఎలా వుంటుంది? అన్న ఆలోచనలు స్టార్ట్ అయ్యాయట. కొందరు నిర్మాణ భాగస్వాములు నిన్నటికి నిన్న సిట్టింగ్ వేసినపుడు, అసలు ఇలాంటి కాంబినేషన్ లో సినిమా తీస్తే ఎలా వుంటుందని అప్పుడే డిస్కషన్లు కూడా స్టార్ట్ చేసేసారట.
అయిడియా నిజంగా బాగానే వుంది. ఆరు అడుగులకు పైగా వుండే రానా, స్క్రీన్ మీద బోయపాటి స్టయిల్ లో విలన్లను ఎత్తి కుదేస్తుంటే, చూడ్డానికి బాగానే వుంటుంది. కానీ రానాతో ప్రాజెక్టు సెట్ కావడం అంత వీజీ కాదు. కేవలం పారితోషికం అంటే ఏదో ఒక పాయింట్ లో డిస్కషన్ లో సెటిల్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అలా వుండదు. సురేష్ బాబు రకరకాలుగా ఆలోచించి, చించి, చించి, స్కీములు వేసి, ప్రాజెక్టును తన కంట్రొల్ వుండేలా సెట్ చేస్తారు.
నే.రా.నే.మ ను కూడా ఆయన అలాగే బిగించి, తనే నిర్మాత అన్నంత ఫోకస్ తెచ్చారు. పాపం, ఆదిలో ప్రాజెక్టు సెట్ చేసుకున్న నిర్మాతలు స్లీపింగ్ పార్టనర్లుగా మారిపోయారు. అందువల్ల అటు వెళ్లడం ఎలా అన్నది కూడా బోయపాటి-రానా సినిమా అయితే ఎలా వుంటుంది అన్న వారి మధ్య డిస్కషన్ కు వచ్చిందట.
వేరే వాళ్లు పూనుకుంటే కాదు, సురేష్ బాబే అనుకంటే వర్కవుట్ అవుతుందేమో ఈ కాంబినేషన్?