ఆ హీరోకి ఈ సినిమా అయినా కలిసొచ్చేనా?

అల్లరి నరేష్ కు ఈ మధ్య ఏం ముట్టుకున్నా కలిసి రావడం లేదు. అందుకే ఈసారి వైవిధ్యమైన కథను తీసుకోవడమే కాదు, డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్ ఇలా కీలకమైన వాళ్లని వేరే భాషల నుంచి…

అల్లరి నరేష్ కు ఈ మధ్య ఏం ముట్టుకున్నా కలిసి రావడం లేదు. అందుకే ఈసారి వైవిధ్యమైన కథను తీసుకోవడమే కాదు, డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్ ఇలా కీలకమైన వాళ్లని వేరే భాషల నుంచి తెచ్చాడు. మళయాలంలో హిట్ అయిన ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. దీనికి దర్శకుడు, సంగీత దర్శకుడు ఇద్దరూ మళయాల మాతృకకు పని చేసిన వారే. మేడమీద అబ్బాయి అని మాంచి సాప్ట్ టైటిల్ పెట్టిన ఈ సినిమా టీజర్ ఇప్పడు విడుదలయింది. 

కాస్త కొత్తగానే వుంది. నరేష్ కొత్తగా కనిపించాడు. నేపథ్య సంగీతం (మళయాల రెహమాన్) కొత్తగా వుంది. అయితే సినిమాలో ఫన్ తో పాటు కాస్త థ్రిల్లర్ లక్షణాలు కూడా వుంటాయి. కానీ వాటిని మాత్రం టీజర్ లోకి తేలేదు. అల్లరి నరేష్ ఇటీవలి సినిమాలతో పోల్చుకుంటే, కాస్త ఫ్రెష్ గా, మరి కాస్త రిప్రెష్ గా కనిపిస్తోంది టీజర్.

ఈ సినిమా కూడా సినిమా రంగంలోకి ప్రవేశించాలనే కుర్రాడి తపన నేపథ్యంలో వుంటుంది. అయితే అలా సినిమా రంగంలోకి చేరాలని చెన్నయ్ వెళ్లిన కుర్రాడి జీవితాన్న ఓ సెల్ఫీ మలుపుతిప్పుతుంది. ఇప్పుడు సెల్ఫీ మానియా అన్నది పల్లె పల్లెలకు పాకేసింది. ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కాస్త ఆకట్టుకునే అవకాశం వుంది.