సుకుమార్ నిర్మించిన దర్శకుడు సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా పెద్దగా నచ్చలేదు ఎవరికీ. కానీ ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్నపాటి డిస్కషన్ మాత్రం సోషల్ మీడియాలో చాలామందిని ఎట్రాక్ట్ చేసింది. దర్శకుడు సినిమాను ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుందనేదే ఆ చర్చ.
దర్శకుడు సినిమాలో హీరో స్వార్థపరుడు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. చివరికి తన ప్రేమను కూడా సినిమా కోసం వాడేసుకుంటాడు. హీరోయిన్ కు యాక్సిడెంట్ అయిందని తెలిసినా సినిమా షూటింగ్ ఆగిపోతుందని ఫ్రెండ్ ను హాస్పిటల్ కు పంపిస్తాడు.
అలాంటి టిపికల్, నెగెటివ్ ఛాయలున్న సినిమా ఇది. సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కానీ ఆ క్యారెక్టర్ ను పోషించిన అశోక్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇలాంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ కు పడితే అదిరిపోతుందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
క్యారెక్టర్ కాస్త కొత్తగా ఉండి, దానికి స్టార్ డమ్ ఇవ్వాలనుకుంటే అంతా ఇప్పుడు ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. మరీ ముఖ్యంగా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ను చూసిన చాలామందికి “దర్శకుడి”లో హీరో పాత్రకు తారక్ మాత్రమే పూర్తిన్యాయం చేయగలడనిపించింది. ఇలాంటి కథను సుకుమార్ హ్యాండిల్ చేస్తే ఇంకా బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం.