హీరోయిన్ ప్రియమణి, బిజినెస్ మేన్ ముస్తాఫా చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఈనెల 23న పెళ్లిచేసుకోబోతున్నారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరుగుతుందని అంతా ఊహించారు. ఈ విషయంపై ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.
చాలా సింపుల్ గా తన పెళ్లి జరుగుతుందని చెప్పింది ప్రియమణి. ఇంకా చెప్పాలంటే తన కాబోయే భర్త ముస్తాఫా రాజ్, మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందట ప్రియమణి. అయితే సినీప్రముఖుల పరిస్థితేంటి..? వాళ్లకు గ్రాండ్ గా పార్టీ ఇస్తానంటోంది.
పెళ్లి తంతు పూర్తయిన మరుసటి రోజు అంటే 24వ తేదీన బెంగళూరులో గ్రాండ్ పార్టీ ఇస్తానంటోంది. ఆ పార్టీకి సౌత్ సినీ సెలబ్రిటీస్ తో పాటు బాలీవుడ్ హీరోలు కూడా హాజరవుతారని చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో 3సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా.. తన సినిమాలు, టెలివిజన్ షోలు కొనసాగిస్తుందట ప్రియమణి.