పావలా వాటా వుండగా, పైసా ఎందుకు?

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు పైసా తీసుకోలేదు. స్వంత సినిమాకు కూడా డబ్బులు అడిగితే ఇంట్లో అన్నం పెట్టరేమో అని అడగలేదు అన్నాడు రానా. కానీ అసలు విషయం వేరుగా వుంది. ఈ…

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు పైసా తీసుకోలేదు. స్వంత సినిమాకు కూడా డబ్బులు అడిగితే ఇంట్లో అన్నం పెట్టరేమో అని అడగలేదు అన్నాడు రానా. కానీ అసలు విషయం వేరుగా వుంది. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడమే, రానాకు రెమ్యూనిరేషన్ కాకుండా లాభాల్లో పావలా వాటా ఇచ్చే విధంగా స్టార్ట్ చేసారు. అలాగే మరో పావలా వాటా డైరక్టర్ తేజకు.

నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి అన్ని విధాలా కిందా మీదా పడి ప్రాజెక్టును ఇలా సెట్ చేసుకుంటే, మధ్యలో సురేష్ బాబు కూడా వాటాకు చేరారు. అంతే తప్ప, ఇదే సురేష్ మూవీస్ స్వంత సినిమా కాదు. బ్లూ ప్లానెట్ వాళ్ల దాంట్లో సురేష్ బాబు కూడా ఓ వాటా దారుడు మాత్రమే.

రెమ్యూనిరేషన్ కింద రానాకు లాభాల్లో పావలా వాటా వుంది. మరి ఇంక అలాంటపుడు పైసా రెమ్యూనిరేషన్ తీసుకోలేదు, ఫ్రీగా చేసానని స్టేట్ మెంట్ లు ఎందుకో? ఫ్రీ గా చేయడం అంటే నాగశౌర్య కథలో రాజకుమారిలో చేసినట్లు. సాయి ధరమ్ తేజ నక్షత్రం సినిమాలో చేసినట్లు. అటు నాగశౌర్య కానీ, ఇటు సాయి ధరమ్ తేజ కానీ రూపాయి తీసుకోకుండా, నారా రోహిత్ కోసం, కృష్ణ వంశీ కోసం పాపం, ఆ సినిమాల్లొ ప్రత్యేక పాత్రలు ఫ్రీగా చేసారు. కానీ రానా అలా కాదుగా.