త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, విడుదల తేదీ మాత్రం ఫిక్సయిపోయింది. జనవరి 10 లేదా 11తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అలా అయితే లాంగ్ వీకెండ్ వస్తుంది. 10 నుంచి ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ వుంటాయి. ఆపై సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఆ పస్ట్ వీకెండ్ ఊపు అలా కొనసాగే అవకాశం వుంటుంది. దానివల్ల బయ్యర్లు సేఫ్ జోన్ లో వుంటారు.
ఎందుకంటే ఈ సినిమా నిర్మాణ వ్యయమే వంద కోట్లు. అమ్మకాలు కచ్చితంగా ఎంత లేదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 నుంచి 80కోట్ల మేరకు వుంటాయి. ఆ రేంజ్ కలెక్షన్లు రావాలి అంటే ఇలాంటి డేట్, ఇలాంటి సీజన్ తప్ప, మామూలుగా సాధ్యం కాదు. అందుకే ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.
మరి సంక్రాంతికి వస్తామని గతంలో ప్రకటించిన రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లోని రంగస్థలం సినిమా ఏమవుతుందో చూడాలి. సంక్రాంతి కోసం 15న విడుదల చేస్తారో? లేక మరో డేట్ చూసుకుంటారో? కొద్ది రోజులు ఆగితే తప్ప తెలియదు. బాబాయ్ పవన్ కోసం చరణ్ ఏకంగా సమ్మర్ కు వెళ్లిపోతారన్న గుసగుసలు కూడా వున్నాయి. కానీ క్లారిటీ లేదు.