ఓవర్ సీస్ మార్కెట్ లో ఏం జరుగుతోంది?

ఓవర్ సీస్ మార్కెట్ అంటే మన సినిమా జనాలకు పెద్ద అండ. కానీ అలాంటి మార్కెట్ కూడా పోటీల కారణంగా, అత్యాశల కారణంగా, సినిమాలు ఢమాల్ అయిపోయి, చాలా మంది కొంపలు కొల్లేరు చేసేసింది.…

ఓవర్ సీస్ మార్కెట్ అంటే మన సినిమా జనాలకు పెద్ద అండ. కానీ అలాంటి మార్కెట్ కూడా పోటీల కారణంగా, అత్యాశల కారణంగా, సినిమాలు ఢమాల్ అయిపోయి, చాలా మంది కొంపలు కొల్లేరు చేసేసింది. దాంతో ఇప్పుడు పెద్ద సినిమా పేరు చెబితే జ్వరం వచ్చినట్లు వణుకుతున్నారు. దాంతో సినిమాలు కొనేదెవరో, బేరాలు ఆడేదెవరో తెలియడం లేదు.

అన్నింటికి కన్నా జై లవకుశ పరస్థితి మరీ దారుణంగా వుంది. ఈ సినిమాను ఓవర్ సీస్ కోసం ఒక బయ్యరు ఏడు కోట్లకు, మరో బయ్యరు 7.50కోట్లకు అడిగారట. కానీ వీళ్లకేమో పది కోట్లకు పైగా రావాలని వుంది. ఆస్ట్రేలియాకు చెందిన వెంకట్ అనే బయ్యర్, హారిక హాసిని నాగవంశీ ద్వారా 10.5కోట్లకు అడిగించినట్లు తెలుస్తోంది. సో, అదే పెద్ద మొత్తం కాబట్టి, వాళ్లకే ఇచ్చేస్తామని యూనిట్ ఫిక్సయింది. కానీ ఇప్పుడు వాళ్లు కూడా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

దీంతో జై లవకుశ కనీసం అడ్వాన్స్ గా నన్నా 10.5కోట్లు ఇవ్వండి. కావాలంటే ఓ రెండు మూడు కోట్లకు రిటర్న్ గ్యారంటీ ఇస్తామని అడుగుతున్నట్లు వినికిడి. అయినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదని టాక్.

ఇదిలా వుంటే స్పైడర్ సినిమాను ఓవర్ సీస్ కొన్నవాళ్లకు, తెరవెనుక ఫండింగ్ ఇస్తామన్న వాళ్లు మొహం చాటేసారని టాక్ వినిపిస్తోంది. దాంతో వాళ్లు, ఫండింగ్ కోసం కొత్త దారులు వెదుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే స్పైడర్ సినిమాను అదర్ దాన్ యుఎస్ కు లైకా వాళ్లు కొన్నారని టాక్. కానీ కొనలేదని, మురుగదాస్ తో వున్న ఆబ్లిగేషన్ తో డిస్ట్రిబ్యూట్ మాత్రం చేసిపెడుతున్నారని తెలుస్తోంది.

ఇక బాలయ్య-పూరి సినిమా ను అయితే ఓవర్ సీస్ కు ఇప్పటి దాకా ఎవరూ తీసుకోలేదు. లై సినిమాను ఓన్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. దీంతో పవన్ సినిమాకు ఇంకా టైమ్ వుంది కదా? అని అస్సలు బేరానికే పెట్టకుండా పక్కన వుంచారు హారిక హాసిని జనాలు.

ఇలా అయిపోయింది, మన సినిమా ఓవర్ సీస్ మార్కెట్ పరిస్థితి. పోటీలకు పోయి, భారీ అంచనాలు వేసుకుని, ఒక్కో పెద్ద సినిమాకు అయిదేసి కోట్ల వంతున రీళ్లపాలు చేసేస్తుంటే, మరేమవుతుంది. చివరకు ఇలాగే మిగుల్తుంది.