అక్కడ కోటి హాంఫట్

ఓవర్ సీస్ మార్కెట్ చిత్రమైనది. అక్కడ అన్ని రకాల సినిమాలు చలామణీ కావు. ఆ సంగతి కొనేవాళ్లకి తెలుసు, సినిమాలు అమ్మే వాళ్లకి తెలుసు. అయితే ఏదో గుర్రం ఎగరా వచ్చు అనే గుడ్డి…

ఓవర్ సీస్ మార్కెట్ చిత్రమైనది. అక్కడ అన్ని రకాల సినిమాలు చలామణీ కావు. ఆ సంగతి కొనేవాళ్లకి తెలుసు, సినిమాలు అమ్మే వాళ్లకి తెలుసు. అయితే ఏదో గుర్రం ఎగరా వచ్చు అనే గుడ్డి నమ్మకంతో కొంటువుంటారు. కోట్లు చెక్కేస్తూ వుంటాయి. ఈ వారం విడుదలయిన రెండు సినిమాల కారణంగా ఓవర్ సీస్ లో కోటి రూపాయిల మేరకు హాంఫట్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. 

నక్షత్రం, దర్శకుడు సినిమాలు ఒక్కోటీ 45లక్షల వంతున కొన్నారు. పైగా ఖర్చులు వుండనే వుంటాయి. ఈ రెండు సినిమాలకు నూటికి నూరు శాతం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఓవర్ సీస్ మార్కెట్ ఈ రెండు సినిమాలకు సంబంధించినంత వరకు మూసుకుపోయినట్లే. పైగా నక్షత్రం సినిమాకు సాంకేతిక సమస్య కారణంగా ప్రీమియర్లు కూడా పడలేదు. 

రెండు సినిమాలు కాస్తో, కూస్తో వసూలు చేసినా, అవి ఖర్చులకు, థియేటర్లకే సరిపోతాయి. ఎలా లేదన్నా, రెండు సినిమాలకు కలిపి చెరో యాభై లక్షలు పోయినట్లే అని టాక్ వినిపిస్తోంది. అసలు కొన్ని సినిమాలు ఓవర్ సీస్ కు అమ్మడం, కొనడం మానేస్తే బెటర్.

ఎందుకంటే ఓవర్ సీస్ జనాల టేస్ట్ తెలుస్తూనే వుంది. సాదా సీదా సినిమాలు, మాస్ మసాలా ఫైటింగ్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చాలా వరకు అక్కడ నడవ్వు. కానీ ఆ సంగతి తెలిసీ కొంటుంటారు. అమ్మతుంటారు. కోట్లు రీళ్లపాలై పోతుంటాయి.