విశాఖలో ఫైనాన్షియల్ హబ్ …!

విశాఖ ఆర్ధిక రాజధాని, పారిశ్రామిక రాజధాని, టూరిజానికి కేంద్రం, ఏపీలో అతి పెద్ద  సిటీ. ఇలా విశాఖ చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతోంది. ఈ నేపధ్యంలో విశాఖకు ఫైనాన్షియల్ హబ్ రావాల్సిన అవసరం ఉందని…

విశాఖ ఆర్ధిక రాజధాని, పారిశ్రామిక రాజధాని, టూరిజానికి కేంద్రం, ఏపీలో అతి పెద్ద  సిటీ. ఇలా విశాఖ చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతోంది. ఈ నేపధ్యంలో విశాఖకు ఫైనాన్షియల్ హబ్ రావాల్సిన అవసరం ఉందని ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. 

వైసీపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ విషయం మీద తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసారు. విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ని ఏర్పాటు చేయమని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ ఫైనాన్షియల్ హబ్ తో విశాఖకు ఆర్ధికంగా ఊతం ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చోటు చేసుకుంటుందని ధర్మాన అంటున్నారు. విశాఖలో ఆర్బీఐ రీజనల్ హెడ్ ఆఫీసుతో పాటు, వివిధ బ్యాంకుల జోనల్ హెడ్ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఫైనాన్షియల్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దాలని ఆయన కోరారు.

వివిధ ఆర్ధిక సంస్థలు విశాఖలో ఏర్పాటు చేయడానికి ఇదే మంచి తరుణం అని ఆయన అంటున్నారు. దీని కోసం విశాఖ పరిసరాలలో వంద ఎకరాల భూమిని కేటాయించి ఫైనాన్షియల్ హబ్ కే దాన్ని వినియోగించాలని సూచించారు. కేంద్ర ఆర్ధిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభ్యర్ధిస్తే విశాఖ తొందరలోనే ఫైనాన్షియల్ హబ్ గా మారుతుందని ఆయన అంటున్నారు.