నాని-మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అయితే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఓ చిన్న పని మాత్రం విమర్శల పాలైంది. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ టోటల్ సినిమా యూనిట్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఈవెంట్ కు యాంకరింగ్ చేసిన సుమ, ఓ ఫన్నీ గేమ్ నిర్వహించింది. స్క్రీన్ పై కొన్ని ఫొటోలు చూపించి హీరోహీరోయిన్ల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. అలా మృణాల్ కు నాని, దుల్కర్ కు చెందిన కొన్ని ఫొటోలు చూపించి అభిప్రాయాలడిగారు. ఆమె కూడా క్యూట్ గా సమాధానాలిచ్చింది.
అంతవరకు బాగానే ఉంది, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక ఫొటోని చూపించారు. అది కూడా వాళ్లు మాల్దీవుల్లో గడిపిన వ్యక్తిగత ఫొటోల్ని పక్కపక్కన పెట్టి మరీ ప్రశ్న అడిగారు. దీంతో మృణాల్ షాక్ అయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థంకాక సైలెంట్ అయింది. ఆ తర్వాత ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంది.
అయితే విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఈ పనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ నాన్న సినిమాకు వీళ్లిద్దరి వ్యక్తిగత ఫొటోలకు ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. తమ సినిమా ప్రచారం కోసం హాయ్ నాన్న యూనిట్ ఇంతకు దిగజారడం కరెక్ట్ కాదంటూ పోస్టులు పెడుతున్నారు.
నిజానికి ఈ విషయం నానికి తెలియకపోవచ్చు. అదంతా ఈవెంట్ మేనేజ్ మెంట్ చూసుకుంటుంది. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమకు కచ్చితంగా సమాచారం ఉండే ఉంటుంది. సుమ అయినా అభ్యంతరం చెప్పి ఉండాల్సిందంటూ ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరోవైపు హాయ్ నాన్న యూనిట్ తో పాటు, ఈవెంట్ మేనేజ్ మెంట్ పై కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
మొన్నటికిమొన్న అన్ స్టాపబుల్ కార్యక్రమం కోసం విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ షిప్ ను ఫుల్ గా వాడేసుకున్నారు. అప్పుడంటే రష్మిక అక్కడే ఉంది కాబట్టి, ఆ ఎపిసోడ్ కూడా ఆమె చుట్టూనే తిరిగింది కాబట్టి ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎలాంటి సంబంధం లేని హాయ్ నాన్న యూనిట్ ఇలా విజయ్-రష్మిక వ్యక్తిగత ఫొటోలు వాడుకొని ప్రచారం చేసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.