మహేష్-రాజమౌళి సినిమాలో మరో హీరోకు చోటు?

ప్రభాస్-రానాను పెట్టి బాహుబలి తీశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ తీశారు. మరి రాజమౌళి కొత్త సినిమాలో కూడా ఇద్దరు హీరోలుంటారా? అతడు తన కొత్త సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నారు. ఈ…

ప్రభాస్-రానాను పెట్టి బాహుబలి తీశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ తీశారు. మరి రాజమౌళి కొత్త సినిమాలో కూడా ఇద్దరు హీరోలుంటారా? అతడు తన కొత్త సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులో మహేష్ మాత్రమే ఉంటారా? మరో హీరో నటిస్తారా?

తాజా సమాచారం ప్రకారం.. రాజమౌళి కొత్త సినిమాలో కూడా ఇద్దరు హీరోలు ఉన్నారట. మెయిన్ లీడ్ గా మహేష్ బాబు కనిపిస్తారు. మరో కీలక పాత్రలో ఇంకో హీరోను తీసుకోబోతున్నారు. ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

రాజమౌళి, మహేష్ సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఉంది. మరీ ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కాబట్టి మహేష్ తో చేయబోయే సినిమాలో కచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా మరో నటుడ్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అతడు బాలీవుడ్ నుంచి వస్తాడా లేక హాలీవుడ్ నుంచి వస్తాడా అనేది తేలాల్సి ఉంది.

కెరీర్ లో చాలా తక్కువగా మల్టీస్టారర్ మూవీస్ లో నటించారు మహేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో వెంకటేష్ కు తమ్ముడిగా కనిపించారు. ఇక మహర్షి సినిమాలో మహేష్ తో పాటు అల్లరి నరేష్ నటించారు. ఈసారి రాజమౌళి సినిమాలో మహేష్ తో ఎవరు స్క్రీన్ షేర్ చేసుకుంటారో చూడాలి.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది మహేష్-రాజమౌళి సినిమా. మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనిలో రాజమౌళి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. గుంటూరు కారం థియేటర్లలోకి వచ్చిన వెంటనే రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. మరోవైపు ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోందనే ప్రచారం కూడా సాగుతోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో మహేష్, రాజమౌళి కలిసి పాల్గొన్నారు. ఆ వేదికపైనైనా సినిమా అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కనీసం యాంకర్ అయినా ప్రాజెక్టు గురించి అడుగుతుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు.