ఎక్స్ క్లూజివ్.. చైతూ కెరీర్ లోనే హయ్యస్ట్

మరికొన్ని గంటల్లో దూత సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సిరీస్ కోసం నాగచైతన్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. దూతలో నటించడానికి, ఇలా ప్రచారం చేయడానికి కలిపి కాస్త గట్టిగానే ఛార్జ్ చేశారు…

మరికొన్ని గంటల్లో దూత సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సిరీస్ కోసం నాగచైతన్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. దూతలో నటించడానికి, ఇలా ప్రచారం చేయడానికి కలిపి కాస్త గట్టిగానే ఛార్జ్ చేశారు ఈ హీరో. ఇంకా చెప్పాలంటే, దూత కోసం చైతూ తన కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ను అందుకున్నారు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు అటుఇటుగా 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు చైతూ. బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాలో నటించినందుకు అతడికిచ్చిన పారితోషికం 8 కోట్లు. దూత వెబ్ సిరీస్ కోసం మాత్రం అతడు ఏకంగా 12 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడితో ఇది అయిపోలేదు.

దూత సిరీస్ కు తాజాగా సీజన్-2 కూడా ప్రకటించారు దర్శకుడు విక్రమ్ కుమార్. దీనికి సంబంధించి ఆల్రెడీ అంతర్గతంగా మాటలు అయిపోయాయి. సో.. ఆ రెమ్యూనరేషన్ కూడా కలుపుకుంటే.. తన ఓటీటీ డెబ్యూ ద్వారా నాగచైతన్య 24 కోట్ల రూపాయలు ఆర్జించినట్టయింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్ ఇది.

మరో 3 రోజుల్లో దూత ప్రచారాన్ని ముగించబోతున్నారు నాగచైతన్య. ఆ వెంటనే చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారు. ఏకథాటిగా 3 నెలల పాటు ఈ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. 

తండేల్ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే దూత సీజన్-2ను ప్రారంభమౌతుంది. మంచి కథలు దొరికితే సినిమాలతో పాటు ఓటీటీలో కూడా కొనసాగుతానని నాగచైతన్య ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.