యానిమల్ ఫీవర్ అలుముకుంటే…

తెలుగునాట సైతం యానిమల్ సినిమా ఫీవర్ అలుముకుంటోంది. ఈ సినిమా కు క్రేజ్ వస్తుందని అందరికీ తెలుసు కానీ ఈ రేంజ్ క్రేజ్ వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. అదే అంచనా వేసి వుంటే,…

తెలుగునాట సైతం యానిమల్ సినిమా ఫీవర్ అలుముకుంటోంది. ఈ సినిమా కు క్రేజ్ వస్తుందని అందరికీ తెలుసు కానీ ఈ రేంజ్ క్రేజ్ వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. అదే అంచనా వేసి వుంటే, జస్ట్ 15 కోట్లకే ఉభయ తెలుగు రాష్ట్రాల హక్కులు ఇచ్చేసి వుండేవారు కాదు. అది వేరే సంగతి. 

ట్రయిలర్ వచ్చిన తరువాత యానిమల్ క్రేజ్ ఆకాశానికి అంటుతోంది. ట్రయిలర్ కట్ అంతలా ఆకట్టుకుంది యువతను. అయితే సినిమా నిడివి అన్నది ఇంకా భయపెడుతూనే వుంది. కానీ దర్శకుడు సందీప్ వంగా మాత్రం దాని మీద ధీమాగా వున్నారు. డిసెంబర్ 1న యానిమల్ సినిమా విడుదల అవుతోంది. ఇది ఎలా వుంటుంది.. ఓకె నా, హిట్ అవుతుందా అన్నది కాదు పాయింట్. 

బ్లాక్ బస్టర్ అయితే మాత్రం తెలుగు సినిమాలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 6న ప్రీమియర్లతో విడుదలవుతోంది నాని సినిమా నాన్న. ఎనిమిదిన విడుదలవుతోంది నితిన్ సినిమా ఎక్స్ ట్రార్డినరీమాన్.  ఈ రెండింటిలో ఒకటి మాంచి క్లాస్ టచ్ ఎమోషనల్ సినిమా. రెండవది పక్కా రొటీన్ మాస్ కమర్షియల్. అందువల్ల యానిమల్ సెన్సేషనల్ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటే మాత్రం ఈ తెలుగు సినిమాలు ఇబ్బంది పడడం ఖాయం.

యానిమల్ అయితే ఎసి, లేదంటే డిసి అవుతుంది తప్ప ఇలాంటి సినిమాలు యావరేజ్ కాదు. అందువల్ల హిట్ అంటూ అయితే అది సెన్సేషన్ గా వుంటుంది. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం మన రెండు తెలుగు సినిమాలకు కాస్త కష్టమే కావచ్చు.