హైదరాబాద్ లో వైజాగ్ సిటీ

ఈకాలం రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఆన్ లొకేషన్ నుంచి లీకుల పరంపర మొదలైపోతుంది. ఇక పీరియాడిక్ సినిమా అంటే లొకేషన్స్ దొరకడం ఇంకా కష్టం. అందుకే మట్కా కోసం…

ఈకాలం రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఆన్ లొకేషన్ నుంచి లీకుల పరంపర మొదలైపోతుంది. ఇక పీరియాడిక్ సినిమా అంటే లొకేషన్స్ దొరకడం ఇంకా కష్టం. అందుకే మట్కా కోసం పాత కాలం వైజాగ్ ను రీ-క్రియేట్ చేస్తున్నారు. పాత వైజాగ్ సెట్ ను హైదరాబాద్ లో వేస్తున్నారు.

1958-1982 మధ్య నడిచే కథతో ఈ సినిమా రాబోతోంది. వైజాగ్ లో అప్పట్లో యావత్ దేశాన్ని కదిలించిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. 24 ఏళ్ల స్పాన్ కథతో రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.

ఇలా రీ-క్రియేట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఉప్పెన కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో సముద్రం సెట్ వేశారు. రీసెంట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కోసం స్టువర్ట్ పురం సెట్, ఇంకాస్త వెనక్కు వెళ్తే శ్యామ్ సింగరాయ్ కోసం కోల్ కతా సెట్ వేశారు. ఇప్పుడు మట్కా కోసం హైదరాబాద్ లో పాత వైజాగ్ సెట్ వేస్తున్నారు.  

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మేకర్స్. 4 యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో 9 భారీ ఫైట్స్ తీయబోతున్నారు. ఇవన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయట. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం కరుణ కుమార్.