నితిన్ పాట కోసం రెండున్నర కోట్లు

నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రార్డినరీ మాన్. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా కోసం ఓ భారీ మాస్ పాటను ఈవారంలో చిత్రీకరించారు. రెండు పెద్ద ప్లోర్ లు కలిపి వేసిన భారీ…

నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రార్డినరీ మాన్. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా కోసం ఓ భారీ మాస్ పాటను ఈవారంలో చిత్రీకరించారు. రెండు పెద్ద ప్లోర్ లు కలిపి వేసిన భారీ త్రీ డైమన్షన్ సెట్ లో ఈ పాటను చిత్రీకరించారు. 

ఇందుకోసం రెండున్నర కోట్లు ఖర్చు చేయడం విశేషం. వందల కొద్దీ ఫారిన్ డ్యాన్సర్లు, ముంబాయి డ్యాన్సర్లను ఈ పాటు కోసం హైదరాబాద్ రప్పించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. హారిస్ జయ్ రాజ్ ట్యూన్ అందించారు.

ఈ పాట లో శ్రీలీల అరడజను డ్రెస్ లు వాడినట్లు తెలుస్తోంది. దాదాపు అన్నీ చిట్టి పొట్టి డ్రెస్ లే. శ్రీలీల-నితిన్ ఇద్దరూ పోటాపోటీగా మాస్ పాటకు చిందులేసారు. సినిమాలో ఈ పాట క్రయిమాక్స్ కు ముందు వస్తుంది.

ఎక్స్ ట్రార్డినరీ మాన్ సినిమాను ఏడాదిన్నరగా చాలా కేర్ తీసుకుని చిత్రీకరించారు. స్క్రిప్ట్ ను ఒకటికి పదిసార్లు చెక్కారు. నితిన్ చాలా శ్రద్ద తీసుకుని, రైటర్ హర్షను తోడు తీసుకుని మరీ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్వంత బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాలో రావు రమేష్ కీలకపాత్రలో కనిపిస్తారు. వక్కంతం వంశీ దర్శకుడు.