శ్రీలీల ఎక్స్ పోజింగ్ వృధా.. వృధా

టాలీవుడ్ తెర మీదకు సర్రున దూసుకువచ్చిన తార శ్రీలీల. పెళ్లి సందడిలో తన డ్యాన్స్ లతో ఆకట్టుకుంది. ధమాకా సినిమాతో ఇండస్ట్రీని తనవైపు తిప్పేసుకుంది. రోజుకు మూడు షిఫ్ట్ ల్లో పని చేసినా, డేట్…

టాలీవుడ్ తెర మీదకు సర్రున దూసుకువచ్చిన తార శ్రీలీల. పెళ్లి సందడిలో తన డ్యాన్స్ లతో ఆకట్టుకుంది. ధమాకా సినిమాతో ఇండస్ట్రీని తనవైపు తిప్పేసుకుంది. రోజుకు మూడు షిఫ్ట్ ల్లో పని చేసినా, డేట్ లు అడ్జస్ట్ చేయలేనంతగా చాన్స్ లు వచ్చి పడ్డాయి. 

ధమాకా సినిమా విజయంలో క్రెడిట్ ఎక్కువగా శ్రీలీలకే దక్కింది కూడా. కానీ శ్రీలీల కూడా కృతిశెట్టి మాదిరిగా డ్యాన్సింగ్, గ్లామర్ డాల్ తప్ప వేరు కాదని అర్థం అయిపోతోంది. స్కంధ సినిమాకు శ్రీలీల కనీసం ఒక్క పర్సంట్ కూడా ప్లస్ కాలేకపోయింది.

ఆదికేశవ సినిమా వచ్చింది. ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనంత ఎక్స్ పోజింగ్ ఈ సినిమాలో చేసింది శ్రీలీల. వీలయినంత పొట్టి డ్రెస్ లు వేసుకుని తొడల ఎక్స్ పోజింగ్ కు సహకరించింది. పాటలో లుంగీ ఎంత వరకు ఎత్తాలో అంతకు అంతా ఎత్తి మరీ డ్యాన్స్ లు చేసింది. కానీ సినిమాకు టికెట్ తెగడానికి ఇవేమీ సహకరించడం లేదు. ఆదికేశవ సినిమా శ్రీలీలకు ఓ బ్లాక్ మార్క్ అనుకోవాలి. భగవంత్ కేసరి సినిమా ఆమెకు మంచి పేరు తీసుకుచవ్చింది. ఆదికేశవ ఆ పేరును తగ్గించింది.

కంటెంట్ వీక్ అయితే కటౌట్ వున్నా ప్రయోజనం లేదని అర్థం అయిపోయింది. శ్రీలీల డేట్ ల కోసం పోటీలు పడుతూ, అడిగినంత రెమ్యూనిరేషన్ ఇవ్వాలని రెడీగా వున్న నిర్మాతలకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇలాంటి పాత్రలే చేస్తూ వెళ్తే శ్రీలీల కూడా కృతిశెట్టి మాదిరిగా అయిపోవడానికి ఎన్ని రోజులో పట్టదేమో?