డిసెంబర్ లో జగన్ విశాఖకు షిఫ్టింగ్ కంఫర్మ్…!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చడం ఖాయం అయింది ఆ నెల కూడా ప్రచారంలోకి వస్తోంది. డిసెంబర్ నెలలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది.…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చడం ఖాయం అయింది ఆ నెల కూడా ప్రచారంలోకి వస్తోంది. డిసెంబర్ నెలలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. డిసెంబర్ 14 తరువాత మార్గశిర మాసం కూడా మంచిదే జనవరి 13 వరకూ మంచి రోజులే ఉన్నాయి.

అయితే కొత్త సంవత్సరం హడావుడి ఆ వెంటనే సంక్రాంతి పండుగ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జగన్ విశాఖకు డిసెంబర్ లోనే వస్తారు అని అంటున్నారు. ఆ తరువాత శూన్యమాసం కూడా ఉంటుంది. దాంతో అన్ని విధాలుగా డిసెంబర్ నెలకే ప్రిఫర్ చేస్తున్నారు అని అంటున్నారు.

ముఖ్యమంత్రి విశాఖ రాకను ఖరారు చేస్తూ ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడింది. ప్రభుత్వంలోని 35 కీలక శాఖల కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు తాజాగా జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు  ఆంధ్ర విశ్వవిద్యాలయం, రుషికొండ, చినగదిలి ప్రాంతాలలో ఉన్న భవనాలలో ఆఫీసులు ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆర్ధిక శాఖ సాధారణ పరిపాలన ఇంధన, సచివాలయ తదితర శాఖలు మినహాయించి మిగిలిన వాటిని విశాఖలో భవనాలు కేటాయించేశారు.

అతి ముఖ్యమైన సీఎం క్యాంప్ ఆఫీసు భవనం ఎక్కడ అన్నది ఆ ఉత్తర్వులో లేదు. అయితే రుషికొండ మీద నిర్మించిన అత్యాధునిక భవంతులో ఒక దాన్ని క్యాంప్ ఆఫీసుగా చేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే సీఎం జగన్ విశాఖ మకాం పెట్టడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని అంటున్నారు.