పవన్ కి మంట పుట్టించేలా సాటి నటుడి కామెంట్స్

సినిమా నటుడిగా ఉన్న క్రేజ్ ని రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి పాలిటిక్స్ చేస్తున్న పవన్ కి సాటి సినీ పరిశ్రమ నుంచి ఎంతవరకూ మద్దతు లభిస్తుందో తెలియదు. పవన్ అయితే గతానికి భిన్నంగా అందరి…

సినిమా నటుడిగా ఉన్న క్రేజ్ ని రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి పాలిటిక్స్ చేస్తున్న పవన్ కి సాటి సినీ పరిశ్రమ నుంచి ఎంతవరకూ మద్దతు లభిస్తుందో తెలియదు. పవన్ అయితే గతానికి భిన్నంగా అందరి హీరోల ఫ్యాన్స్ తనకు ఓటేయాలని కోరుతున్నారు. తన ఇన్స్టా గ్రాం లో ఫస్ట్ పోస్ట్ కూడా పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల దాకా నటుల దాకా అందరినీ కలిపి పెట్టేసి తాను అందరివాడు అనిపించుకున్నారు.

పవన్ రాజకీయం ఎలా ఉందో 2019 ఫలితాలు చాలానే చూపించాయి. ఆయన రాజకీయం ఎటు వైపు వెళ్ళాలన్నది 2024 ఫలితాలు చెప్పనున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే జగన్ మీద విమర్శల ఘాటు పెంచారు. ఏకవచన ప్రయోగం చేస్తున్నారు. నిందిస్తున్నారు. దాని మీద వైసీపీ నుంచి హాట్ కామెంట్స్ వస్తున్నాయి.

విశాఖ జిల్లా నర్శీపట్నానికి చెందిన సినీ నటుడు జోగి నాయుడు అయితే పవన్ కి మంటపుట్టించేలా కామెంట్స్ చేశారు. పవన్ సభలు చూస్తున్నానని ఆయనకు సీఎం జగన్ మీద ఉన్నది నిండా అసూయ ద్వేషం తప్ప మరోటి కాదని జనాలకు అర్ధమైంది అన్నారు. ఎవరి సంస్కారం ఏమిటి అన్నది మాటల ద్వారా ఆలోచనల ద్వారానే బయటపడుతుందని, పవన్ జగన్ మీద చేస్తున్న కామెంట్స్ ని ఆయన సభలకు వచ్చిన జనాలే హర్షించడంలేదని జోగినాయుడు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలని అనుకుంటున్నారని, కానీ ఆయన ఉన్న సినీ రంగానికి ఇప్పటిదాకా చేసేసిన మేలేంటో చెప్పాలని సరైన సవాల్ నే విసిరారు జోగినాయుడు. ఆయన ఏమైనా స్టూడియోలు కట్టారా, పదిమందికి ఉపాధి కల్పించే పనులు ఏమైనా చేశారా. అసలు ఆయన సినీ రంగానికి చేసిన సేవ ఏంటో ముందు చెబితే ఏపీ ప్రజలకు ఏమి చేయవచ్చో తరువాత చూద్దామని సెటైర్లు వేశారు.

జగన్ కి సీఎం పదవి ఊరకే రాలేదని, ఆయన పదేళ్ళ రెక్కల కష్టం. ప్రజల కోసం చేసిన పోరాటాలు, ఆయన పడిన తపన, ఆయన ప్రజలను చూసిన విధానం, ప్రజలు ఆయనలో చూసుకున్న నాయకత్వం ఇవన్నీ కలిసే 2019లో దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా 151 సీట్లతో అధికారం దక్కిందని అన్నారు. అటువంటి సీఎం మీద పవన్ చేస్తున్న కామెంట్స్ ఏ మాత్రం సబబుగా లేవని జోగినాయుడు అంటూ ప్రజలే ఎవరేంటి అన్నది తేలుస్తారని 2024 ఫలితాల మీద సేనానికి హింట్ ముందే ఇచ్చారు.