నాగచైతన్య సినిమాలో పాకిస్థాన్ కనెక్షన్

ఈరోజు నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. సినిమా టైటిల్ తో పాటు, చైతూ ఫస్ట్ లుక్ ను ఒకేసారి విడుదల చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు తండేల్ అనే…

ఈరోజు నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. సినిమా టైటిల్ తో పాటు, చైతూ ఫస్ట్ లుక్ ను ఒకేసారి విడుదల చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు చైతూ.

“చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఇది నా కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. చాలా పెద్ద కాన్వాస్, స్పాన్ ఉన్న కథ. ఈ సినిమా కోసం టీం అంతా చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచుస్తున్నాం. కథ ప్రకారం కొంత భాగం ఇండియాలో కొంత భాగం పాకిస్తాన్ లో జరుగుతుంది. తండేల్ చిత్రం నా కెరీర్ లోనే సెన్సేషనల్ మూవీ అవుతుంది”

ఇలా తండేల్ సినిమా కథలో పాకిస్థాన్ ఎలిమెంట్ కూడా ఉందని బయటపెట్టారు చైతూ. ఈ మూవీ కోసం గడిచిన 6 నెలలుగా నాగచైతన్య
మేకోవర్ అవుతున్నారు. అలా తండేల్ కోసం కొత్తగా ముస్తాబైన నాగచైతన్య లుక్ ను కూడా ఈరోజు రివీల్ చేశారు.

“ఇందులో నాది బెస్తవాడి పాత్ర. అందుకే మేకోవర్ అయ్యాను. మత్స్యకారుల బాడీలాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలా మారడానికి కొన్ని నెలల పాటు శ్రమించాల్సి వచ్చింది. మత్స్యకారులు నల్లగా ఉంటారు కదా, నేను తెల్లగా ఎలా అనుకోవద్దు. ఏ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తండేల్ సినిమాలో నా పాత్రను దర్శకుడు క్రియేట్ చేశాడో, ఆ వ్యక్తి నా కంటే తెల్లగా ఉన్నాడు. అతడ్ని నేను కలిశాను, అతడితో మాట్లాడాను. కాబట్టి అలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రతి విషయంలో కేర్ తీసుకొని సినిమా చేస్తున్నాం.”

ఇలా యదార్థ ఘటనల ఆధారంగా తండేల్ సినిమా వస్తుందనే విషయాన్ని బయటపెట్టారు చైతూ. ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతున్నారు నాగచైతన్య. దీనికోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించి మరీ బాడీ లాంగ్వేజ్, యాసలో ట్రయినింగ్ తీసుకున్నానని తెలిపారు.

డిసెంబర్ మొదటి వారం నుంచి సెట్స్ పైకి రాబోతోంది తండేల్ సినిమా. 3 నెలల పాటు ఏకథాటిగా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.