కాస్టింగ్ కౌచ్.. ఆ సీనియర్ తెలుగు హీరో అతడేనా?

సౌత్ లో మరో కాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి టాలీవుడ్ నుంచి ఓ పెద్ద తెలుగు హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి పేరు విచిత్ర. ప్రస్తుతం…

సౌత్ లో మరో కాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి టాలీవుడ్ నుంచి ఓ పెద్ద తెలుగు హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి పేరు విచిత్ర. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న విచిత్ర, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది.

2000-2001 ప్రాంతంలో తను ఓ తెలుగు సినిమాలో నటించినట్టు వెల్లడించిన విచిత్ర.. ఆ టైమ్ లో  ఓ తెలుగు సీనియర్ హీరో తనను లైంగికంగా వేధించినట్టు వెల్లడించింది. పాలక్కడ్ ప్రాంతంలో ఆ సినిమా షూటింగ్ జరిగిందట. ఆ షెడ్యూల్ లో తను పాల్గొన్నానని, హీరోను కలిసిన సందర్భంలో తనకు చేదు అనుభవం ఎదురైనట్టు వెల్లడించింది విచిత్ర.

“కనీసం తన పేరు కూడా తెలుసునే ప్రయత్నం చేయలేదు ఆ సీనియర్ హీరో. వెంటనే గదిలోకి రమ్మని పిలిచాడు. నేను షాక్ అయ్యాను. అక్కడ్నుంచి మెల్లగా జారుకొని నా రూమ్ కు చేరుకున్నాను. మరుసటి రోజు నుంచి నాకు సెట్స్ లో వేధింపులు మొదలయ్యాయి. నా షాట్స్ ఓకే అవ్వలేదు. ఆ తర్వాత నుంచి ప్రతి రోజూ ఎవరో నా రూమ్ తలుపు తట్టేవారు. అసభ్యంగా మాట్లాడేవారు.”

హోటల్ మేనేజర్ సహాయంతో తను రోజుకో రూమ్ మారినప్పటికీ తనపై వేధింపులు ఆగలేదని, ఎలాగోలా తన రూమ్ కనుక్కొని వచ్చి కొంతమంది అసభ్యంగా ప్రవర్తించేవారని చెప్పుకొచ్చింది విచిత్ర.

“ఓ షాట్ లో ఎవరో నన్ను వెనక నుంచి అసభ్యంగా తాకారు. పొరపాటున జరిగి ఉంటుందనుకున్నాను. పదేపదే జరగడంతో వెంటనే అతడ్ని స్టంట్ మాస్టర్ ముందుకు తీసుకెళ్లాను. కానీ ఆశ్చర్యంగా స్టంట్ మాస్టర్ నన్నే నిందించాడు. నాపై చేయి చేసుకున్నాడు కూడా.”

ఆ అవమాన భారంతో సెట్స్ పై నుంచి వెళ్లిపోయిన విచిత్ర, ఆ తర్వాత యూనియన్ ను సంప్రదించినా ఫలితం దక్కలేదని వాపోయింది. అలా తన కెరీర్ ముగించాల్సి వచ్చిందని బాధపడింది. ఆ టైమ్ లో హోటల్ రూమ్స్ మార్చి తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తినే ఆ తర్వాత విచిత్ర పెళ్లి చేసుకుంది.

బిగ్ బాస్ హౌజ్ లో విచిత్ర ఈ వివరాలు బయటపెట్టిన వెంటనే, సోషల్ మీడియా జనం మొత్తం 'భలేవాడివి బాసు' అనే చిత్రాన్ని ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ఆ టైమ్ లో విచిత్ర నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా అదే. పైగా ఆ సినిమా షూటింగ్ పాలక్కడ్ లో జరిగింది కూడా. అరుణ్ ప్రసాద్ డైరక్ట్ చేసిన ఆ సినిమాలో బాలకృష్ణ, అంజలా ఝవేరి, శిల్పా షెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు.