జూనియర్ పూరికి మరో సినిమా

పాపం, ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఆకాష్ పూరికి సమస్య అయిపోయింది. కొడుకు తో చేస్తున్న సినిమాను కాస్త పక్కన పెట్టి పాన్ ఇండియా సినిమా మీదకు వెళ్లిపోయారు పూరి జగన్నాధ్.…

పాపం, ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఆకాష్ పూరికి సమస్య అయిపోయింది. కొడుకు తో చేస్తున్న సినిమాను కాస్త పక్కన పెట్టి పాన్ ఇండియా సినిమా మీదకు వెళ్లిపోయారు పూరి జగన్నాధ్.

ఇలాంటి నేపథ్యంలో ఈ లోగా మరో సినిమాను స్టార్ట్ చేసాడు ఆకాష్ పూరి. గతంలో జార్జిరెడ్డి సినిమా అందించిన దర్శకుడు జీవన్ రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా కు ఇవ్వాళ క్లాప్ పడింది. 

ఆకాష్ పూరీ, జీవన్ రెడ్డి కాంబినేషన్ చిత్రానికి “చోర్ బజార్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్ కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు. 

“చోర్ బజార్” సినిమా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చిత్రంలో సుబ్బరాజు, పోసాని,  ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

ఎవరి సత్తా ఏమిటో తెలిసే రోజులొస్తున్నాయ్

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది