ఎక్స్ క్లూజివ్.. జీ గ్రూప్ చెంతకు చేరిన ‘వరుడు’

కొన్నాళ్లుగా శాటిలైట్-డిజిటల్ డీల్స్ లో దూసుకుపోతున్న జీ గ్రూప్, మరో సినిమాను సొంతం చేసుకుంది.నాగశౌర్య హీరోగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా రైట్స్ ను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది.  Advertisement సితార ఎంటర్…

కొన్నాళ్లుగా శాటిలైట్-డిజిటల్ డీల్స్ లో దూసుకుపోతున్న జీ గ్రూప్, మరో సినిమాను సొంతం చేసుకుంది.నాగశౌర్య హీరోగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా రైట్స్ ను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. 

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను అటుఇటుగా 6 కోట్ల రూపాయలకు ఈ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ బ్యానర్ పై తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు, బాబు బంగారం, జెర్సీ లాంటి సినిమాలతో పాటు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రంగ్ దే మూవీని కూడా జీ గ్రూప్ సొంతం చేసుకోగా… ఇప్పుడు వరుడు కావలెను మూవీ కూడా ఇదే సంస్థ చేతికి చేరింది.

రీసెంట్ గా వాలంటైన్స్ డేకి ఈ సినిమా నుంచి ఓ సింగిల్ రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాటకు ఓ మోస్తరుగా రెస్పాన్స్ వస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

లక్ష్మీసౌజన్య డైరక్టర్ గా పరిచయమౌతున్న ఈ సినిమాలో శౌర్య సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

ఎవరి సత్తా ఏమిటో తెలిసే రోజులొస్తున్నాయ్

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది