దమ్ మసాలా లీక్… మహేష్ ఫ్యాన్స్ గగ్గోలు

ఇప్పుడు లీక్ అవ్వడమేంటి.. దమ్ మసాలా సాంగ్ ఆల్రెడీ రిలీజైంది కదా అనుకోవద్దు. రిలీజైంది ఆడియో. ఇప్పుడి లీక్ అయింది వీడియో. అవును.. గుంటూరు కారం సినిమాలో దమ్ మసాలా సాంగ్ కు సంబంధించి…

ఇప్పుడు లీక్ అవ్వడమేంటి.. దమ్ మసాలా సాంగ్ ఆల్రెడీ రిలీజైంది కదా అనుకోవద్దు. రిలీజైంది ఆడియో. ఇప్పుడి లీక్ అయింది వీడియో. అవును.. గుంటూరు కారం సినిమాలో దమ్ మసాలా సాంగ్ కు సంబంధించి వీడియో క్లిప్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోను ఎలివేట్ చేస్తూ పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ లో మహేష్ బాబు మాంఛి మాస్ స్టెప్పులేశారు. ఈ విషయాన్ని నాగవంశీ ఇదివరకే ప్రకటించారు. సిల్వర్ స్క్రీన్ పై అదొక ఫీస్ట్ లా ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడా ఫీస్ట్ లీక్ అయింది. దమ్ మసాలా సాంగ్ లో మహేష్ వేసిన 2 స్టెప్స్ కు సంబంధించిన ఆన్-లొకేషన్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

లీక్ అయిన వెంటనే మేకర్స్ అప్రమత్తమయ్యారు. చాలా క్లిప్స్ ను తొలిగించారు. అటు ఫ్యాన్స్ కూడా క్లిప్స్ ను షేర్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఓ మూల, ఏదో ఒక మాధ్యమంలో ఈ క్లిప్స్ కనిపిస్తూనే ఉన్నాయి.

చూస్తుంటే, టాలీవుడ్ లో లీక్స్ కామన్ అయిపోయేలా ఉన్నాయి. కల్కి, పుష్ప-2, సలార్, గేమ్ ఛేంజర్.. ఇలా భారీ సినిమాలన్నీ లీకుల బారిన పడుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్న ఈ రోజుల్లో వీటిని ఆపడం మేకర్స్ కు తలకుమించిన భారంగా మారుతోంది.

గుంటూరుకారం నుంచి సెకెండ్ సింగిల్ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.