సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. లైగర్ వాళ్ల ఆశలు నిరాశ చేసింది. ఖుషీ ఏమన్నా పని జరుగుతుంది అనుకుంటే అదీ ఎంతో కొంత నిరాశనే మిగిల్చింది. దర్శకుడు పరుశురామ్ మీద మరీ అంత భయంకరమైన నమ్మకాలు లేవు కానీ, ఏదో ఒకటి చేస్తాడేమో అన్న ఆశలు అయితే వున్నాయి.
సంక్రాంతి సీజన్ లో వస్తుంది. మంచి హిట్ అవుతుంది అని ఎదురుచూస్తున్నారు. కానీ సంక్రాంతికి రావడం లేదనే క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. అంటే ఇంక మిగిలింది మార్చి నెలనే. ఎందుకంటే ఫిబ్రవరి నెల మీద అప్పుడే చాలా సినిమాలు కన్నేసాయి.
ఇదిలా వుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా తరువాత విజయ్ చేయాల్సింది గౌతమ్ తిన్ననూరితో. అతగాడు ఓ చిన్న సినిమా పనిలో వున్నాడు. విజయ్ ఫ్యామిలీ స్టార్ నుంచి రావాలి. గౌతమ్ ఆ సినిమా నుంచి రావాలి. పైగా అది భారీ సినిమా. రెండు భాగాలు అని టాక్ వుంది. అంటే కనీసం ఏడెనిమిది నెలలు షూట్ పడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే 2024 సంక్రాంతి ని టార్గెట్ చేసే అవకాశం వుంది. అలా అంటే 2024 మొత్తం మీద ఫ్యామిలీ స్టార్ తప్ప మరో సినిమా విడుదల కాదు.
మిగిలిన హీరోల ఫ్యాన్స్ మాదిరిగానే విజయ్ ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ స్టార్ తరువాత చాలా కాలం ఎదురుచూడక తప్పదు?