ప్రభాస్ ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్న సినిమా సలార్. ఈ సినిమా అలవైకుంఠపురములో, కేజీఎఫ్ రేంజ్ హిట్ కావాల్సిందే. ఆ రేంజ్ లో హిట్ కాకుంటే బయ్యర్లు సేఫ్ కావడం అన్నది అసాధ్యమైన సంగతి.
సీడెడ్ మినహా ఆంధ్ర ఏరియాను 80 నుంచి 85 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. అంత మొత్తం రికవరీ కావాలంటే దాదాపు 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. 85 కోట్ల మీద బయ్యర్లకు కమిషన్లు రావాలంటేనే వంద కోట్లు కావాలి. ఆపైన ఖర్చులు, థియేటర్ రెంటల్స్ అన్నీ పోవాలి.
అలవైకుంఠపురములో లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఉత్తరాంధ్ర 20 కోట్లు, నైజాం 42 కోట్లు వసూలు చేసింది. సలార్ సినిమా నైజాంలో 70 కోట్లకు పైగా, ఉత్తరాంధ్రలో 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలంటే ఆర్ఆర్ఆర్ రేంజ్ హిట్ కావాలి. అంత హిట్ అయితే తప్ప బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కావడం కష్టం.
సలార్ కనుక అంత పెద్ద హిట్ అయితే ఇంకో సమస్య వుంది. అది సంక్రాంతి సినిమాలకు ఎదురయ్యే సమస్య. సలార్ బయ్యర్లు టార్గెట్ చేరాలి అంటే కనీసం నాలుగు వారాలు బీభత్సంగా ఆడేస్తుంది. హిట్ అయితే ఆడేస్తుంది కూడా. కానీ అలా ఆడితే ఆ ప్రభావం సంక్రాంతి సినిమాల మీద కచ్చితంగా పడుతుంది. సంక్రాంతికి సలార్ కూడా ఓ బలమైన ఆప్షన్ అవుతుంది. అప్పుడు కచ్చితంగా సంక్రాంతి సినిమాలు అఫెక్ట్ అవుతాయి.
ఆర్ఆర్ఆర్ తరువాత ఆ స్ధాయి వసూళ్లు సాధించిన ఏదీ లేదు. ఇప్పుడు సలార్ ఆ ఫీట్ సాధించాల్సి వుంటుంది. అది సాధిస్తే మాత్రం ఎగ్జిబిటర్లకు కు పండగే పండగ. ఇటు సలార్, అటు సంక్రాంతి సినిమాలు దుమ్ము దులిపితే ఆ కిక్కే వేరు.