అక్కడ రాత్రి అయితే విమానం ఎగరదు

విశాఖ వంటి మహా నగరంలో కొన్నాళ్ల పాటు రాత్రి పూట విమానాలు ఎగిరే అవకాశాలు అయితే లేవు. విశాఖ విమానాశ్రయం రన్ వే పునరుద్ధరణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ…

విశాఖ వంటి మహా నగరంలో కొన్నాళ్ల పాటు రాత్రి పూట విమానాలు ఎగిరే అవకాశాలు అయితే లేవు. విశాఖ విమానాశ్రయం రన్ వే పునరుద్ధరణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 15 నుంచి విశాఖ విమానాశ్రయం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ మూసివేస్తారు.

ఎలాంటి కార్యకలాపాలు ఈ మధ్యలో అసలు జరగవని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విధంగా ఆరు నెలల పాటు విశాఖలో రాత్రి పూట విమానయాన సేవలు నిలిచిపోనున్నాయని పేర్కొంటున్నారు. దీని మీద ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలు విశాఖ తూర్పు నావికాదళం అధికారులతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది. విశాఖ విమానాశ్రయం నౌకాదళం ఆధీనంలో ఉంది. దీంతో తూర్పు నావికాదళం రన్ వే పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది.

ఇది తప్పనిసరి అని నేవీ అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయం మూసివేస్తామని ఇది కేవలం ప్రయాణీకుల భద్రత కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. ఇదిలా ఉంటే పగటి పూట విమానా సేవలలను ఇంకా ఎక్కువగా పెంచుకునేందుకు మాత్రం నేవీ అధికారులు అనుమతించడం విశేషం.

ఆరు నెలలు అంటే మే నెల దాకా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విమాన సేవలు చాలా అవసరం. రాత్రి వేళలో తొమ్మిది దాటితే విమానం ఎగరకపోతే ఉదయం ఎనిమిది దాటక కానీ అనుమతించకపోతే ఇబ్బందులే అంటున్నారు.