విశాఖకు బ్రైట్ ఫ్యూచర్ అంటూ ఇండియానా మేయర్ కితాబు

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖను చూసిన వారు ఎవరైనా పొగడకుండా ఉండలేరు. మనసులోని మాటలను చెప్పకుండా ఉండలేరు. విశాఖ వచ్చిన అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన కార్మెల్ నగర మేయర్ జేమ్ బ్రైనర్డ్ విశాఖపట్నం…

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖను చూసిన వారు ఎవరైనా పొగడకుండా ఉండలేరు. మనసులోని మాటలను చెప్పకుండా ఉండలేరు. విశాఖ వచ్చిన అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన కార్మెల్ నగర మేయర్ జేమ్ బ్రైనర్డ్ విశాఖపట్నం ఎంతో భవిష్యత్తు వున్న నగరమని కీర్తించారు.

విశాఖకు ఉజ్వలమైన అభివృద్ధి కూడా ఉందని అన్నారు. విశాఖతో కలసి పనిచేయాలన్న తన కోరికను వెలుబుచ్చారు. విశాఖ- కార్మెల్ నగరాలు కలిసి ఉమ్మడి విధానాలను రూపొందించుకుని కలిసి పని చేసేందుకు ఇప్పటికే ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న నేపద్యంలో జేమ్ బ్రైనర్డ్  రెండు రోజులుగా విశాఖలో పర్యటిస్తున్నారు.

ఆయన విశాఖలోని అనేకమైన దర్శనీయ స్ధలాలను తిలకించి పులకించారు. విశాఖ జీవీఎంసీలో ఆయనకు విశాఖ అభివృద్ధి గురించి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి వివరించారు. నగరంలో అమలవుతోన్న పౌర సేవలను వివిధ విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. విశాఖలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ విధానాలతో పాటు అమలవుతున్న ఎకో వైజాగ్ కార్యక్రమం గురించి కూడా  వివరించారు.

ఈ సందర్భంగా జేమ్ బ్రైనార్డ్ మాట్లాడుతూ నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ఎంతో శాస్త్రీయ విధానాలు అమలవుతున్నాయని ప్రశంసించారు. విశాఖను పచ్చదనంతో పాటుగా పరిశుభ్రంగా ఉంచుతున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. విశాఖ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అగ్ర స్థానంలో ఉందని కూడా అన్నారు. అలా విదేశాలలో ఉన్న పాలకులకు కూడా విశాఖ ది బెస్ట్ సిటీగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఏపీగా ఉంది. మరి విశాఖను ఏపీకి పాలనా రాజధానిగా ఎంపిక చేయడంలో తప్పు లేదనే అంతా అంటున్నారు.