బ్యాక్ చూపించడానికి రూ.5 లక్షల డ్రెస్

సమంత స్టిల్ ఏదైనా రిలీజైందంటే, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ఆమె పోజులు అలాంటివి. ఈసారి కూడా అలాంటిదే ఓ వైరల్ పిక్ పోస్ట్ చేసింది సమంత. అది అలాంటిలాంటి…

సమంత స్టిల్ ఏదైనా రిలీజైందంటే, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ఆమె పోజులు అలాంటివి. ఈసారి కూడా అలాంటిదే ఓ వైరల్ పిక్ పోస్ట్ చేసింది సమంత. అది అలాంటిలాంటి పోజు కాదు. బ్యాక్ మొత్తం కనిపించేలా దిగిన ఫొటో.

ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫొటోషూట్ లో భాగంగా ఇలా బ్యాక్ మొత్తం కనిపించేలా పోజులిచ్చింది సమంత. అయితే ఇలా వెనక భాగం కనిపించేలా పోజులివ్వడం మామూలు విషయం కాదు. దీనికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు కావాలి. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

'ఈ పోజు ఇవ్వడం కోసం సమంత ధరించిన ఈ దుస్తుల ఖరీదు అక్షరాలా 5 లక్షల 50వేల రూపాయలు. లూయీస్ వూటాన్ కు చెందిన డిజైనర్ వేర్ ఇది. వెనక వైపు మాత్రమే కాదు, ముందు భాగంలో కూడా ఓ మోస్తరుగా గ్లామర్ ఒలకబోసేందుకు వీలుగా డిజైన్ చేసిన డ్రెస్ ఇది.

ప్రస్తుతం ఈ డ్రెస్ లో సమంత ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. శారీరకంగా ఫిట్ గా తయారయ్యేందుకు గ్యాప్ తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఫొటోషూట్స్ మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఆమెకిదే ఆదాయ వనరు. ఇప్పుడిలా కనిపించి అలరించింది.