హమ్మయ్య.. మొత్తానికి సలార్ సినిమా టీమ్ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ట్రైలర్ వస్తోంది అంటూ. అయితే చిన్న నిరాశ ఏమిటంటే, అప్పుడే కాదు. డిసెంబర్ 1న. అంటే దాదాపు ఇంకా ఇరవై రోజుల వేచి వుండాలి ఫ్యాన్స్.
సలార్ సినిమా మీద రకరకాల గ్యాసిప్‌లు. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ మీద. ఇప్పటికే వాయిదాలు పడి, డిసెంబర్ 22 కు ఫిక్స్ అయింది. వస్తుందో రాదో అన్న అనుమానాలు. ఎందుకంటే ఏ విధమైన కంటెంట్ బయటకు వదలడం లేదు.
అలాగే సినిమాకు నాన్ థియేటర్ బిజినెస్ సమస్యలు వున్నాయని, ఇంకా ఏవేవో సమస్యలు వున్నాయని రకరకాల వార్తలు. దీంతో ఫ్యాన్స్ కు కాస్త టెన్షన్. ఇలాంటి నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామంటూ అప్ డేట్ ఇచ్చారు సలార్ నిర్మాతలు. అయితే ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ వస్తోంది అంటూ ముందుగా ఓ ఫైలట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇదే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ కావడానికి
డిసెంబర్ 1 ఒకటి వరకు ట్రైలర్ అనౌన్స్ మెంట్ తప్ప మరోటి వుండకపోవచ్చు. డిసెంబర్ 1 తరువాత నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలు వుంటాయి. హీరో ఫ్రభాస్ ఇండియాకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ కు ప్రమోషన్లకు రెడీ కావచ్చు.