ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ పాయల్ రాజపుత్ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా వుంటుంది. తెర మీదకు అలాంటి హీరోయిన్ క్యారెక్టర్ ను తీసుకురావడం అదే తొలిసారి. దర్శకుడు అజయ్ భూపతి చాలా బోల్డ్ గా అదే టైమ్ లో అందంగా ఆ క్యారెక్టర్ ను తీర్చి దిద్ది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు.
తరువాత మంచి రస్టిక్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథను ట్రయ్ చేసారు కానీ అంతగా క్లిక్ కాలేదు. ఇప్పుడు ఈసారి హర్రర్.. మర్టర్ మిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్నారు. మంగళవారం అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్. ఈ సినిమాలో కూడా తెర మీదకు తీసుకురావడానికి చాలా మంది ధైర్యం చేయని పాత్రను పాయల్ చేస్తోందట. విపరీతమైన సెక్స్ కోరికలు వుండే అమ్మాయిలు కూడా వుంటారు. అలాంటి పాత్ర ఏదో రూపొందించారు అజయ్ భూపతి అని తెలుస్తోంది. ఇలాంటి క్యారెక్టర్ ను తెరపై చూపడం, చేయడం అంటే కాస్త ధైర్యం చేయాల్సిందే.
మంగళవారం సినిమా ట్రయిలర్ లో ఇప్పటికే శాంపిల్ చూపించారు. సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా లో ఇదంతా ఏ రేంజ్ లో వుంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు పెరుగుతోంది. నిజానికి ఇది డబుల్ పదును వుండే వ్యవహారం. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అజయ్ భూపతి, పాయల్ ఈ సీన్లను ఎలా తెరకెక్కించారో చూడాల్సిందే.