హీరోయిన్లలో చాలామంది మల్టీ టాలెంటెడ్ ఉన్న సంగతి తెలిసిందే. నివేత పెతురాజ్ కూడా ఈ కోవకే చెందుతుంది. హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు క్రీడల్లో కూడా రాణిస్తోంది.
మధురైలో జరిగిన బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో కప్ కొట్టింది నివేత. గెలిచిన ఆనంద క్షణాల్ని తన అభిమానులతో పంచుకుంది. మరో కప్ కోసం వెయిటింగ్ అనే అర్థం వచ్చేలా నెక్ట్స్ ఏంటి అంటూ కొటేషన్ కూడా పెట్టింది.
నివేత పెతురాజ్ కు ఆటలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది కూడా. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా.. స్విమ్మింగ్, కార్ రేసింగ్ లో కూడా ఆమెకు ప్రవేశం ఉంది.
ఫార్ములా రేసు కార్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ అందుకుంది నివేత. రేసింగ్ ను చాలా సీరియస్ గా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన కార్ల కలెక్షన్ ను కూడా బయటపెట్టింది.
ఆమె ఫస్ట్ కారు టయోటా యారిస్. ఆ తర్వాత డాడ్జ్ ఛాలెంజర్ దక్కించుకుంది, ఆ తర్వాత బెలెనో, బీఏండబ్ల్యూ ఎక్స్4 కొనుగోలు చేసింది. అప్పట్లో దుబాయ్ లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళగా నివేత రికార్డు సృష్టించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కూడా రాణిస్తోంది.
తెలుగులో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో, దాస్ కా ధమ్కీ లాంటి హిట్ సినిమాల్లో నటించింది నివేత పెతురాజ్. తమిళ్ లో ఆమె నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది.