శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేందుకు అందరూ అయోధ్యకు వెళ్లలేరు. పైగా 22వ తేదీన సామాన్యులకు ప్రవేశం లేదు. దాదాపు 8వేల మంది సెలబ్రిటీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అందుకే సామాన్య భక్తుల కోసం మల్టీప్లెక్సులు రెడీ అవుతున్నాయి.
22వ తేదీన జరగనున్న రామాలయం ప్రారంభోత్సవాన్ని లైవ్ లో చూపించబోతోంది పీవీఆర్ ఐనాక్స్ సంస్థ. ఆజ్ తక్ భాగస్వామ్యంతో 70కి పైగా నగరాల్లోని తమ మల్టీప్లెక్సుల్లో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది పీవీఆర్
అయితే ఇది ఉచితం మాత్రం కాదు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బిగ్ స్క్రీన్ పై తిలకించాలనుకునేవారు వంద రూపాయలు పెట్టి టికెట్ కొనాలి. అయితే ఈ వంద రూపాయాల్లోనే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ను కూడా అందిస్తోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2 గంటల పాటు ప్రారంభోత్సవాన్ని లైవ్ గా ప్రసారం చేస్తారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ తో పాటు దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు హాజరుకాబోతున్నారు.