థమన్ కు ఏమయింది?

సంగీత దర్శకుడు థమన్ తెలుగు టాప్ మ్యూజిక్ డైరక్టర్లలో ఒకరు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తరువాత థమన్ ఓ రేంజ్ కు వెళ్లిపోయారు. ప్రతి పెద్ద సినిమా దాదాపుగా థమన్ చేతిలోనే.…

సంగీత దర్శకుడు థమన్ తెలుగు టాప్ మ్యూజిక్ డైరక్టర్లలో ఒకరు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తరువాత థమన్ ఓ రేంజ్ కు వెళ్లిపోయారు. ప్రతి పెద్ద సినిమా దాదాపుగా థమన్ చేతిలోనే. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరి ఛాయిస్ ను థమన్ నే. అఖండ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ థమన్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. కానీ ఆ తరువాత నుంచి ఏమయిందో సరైన చార్ట్ బస్టర్ సాంగ్ థమన్ నుంచి రావడం కష్టం అవుతోంది.

సర్కారు వారి పాట సినిమాలో సాంగ్స్ కొంత వరకు అలరించినా, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. అప్పటి నుంచి థమన్ మీద అభిమానుల్లో సైతం అసంతృప్తి మొదలైంది. థమన్ ఇస్తున్న ఆల్బమ్స్ కూడా అలాగే వున్నాయి. ఏవీ పూర్తి సంతృప్తి ఇవ్వడం లేదు. పని వత్తిడి ప్రభావం థమన్ మీద పడినట్లు కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో పలువురు హీరోలు ఆల్టర్ నేటివ్ కోసం చూడడం ప్రారంభమైపోయింది. 

ఇది గమనిస్తూ కూడా థమన్ ఎందుకో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మరోపక్క థమన్ పేరు చెప్పి అడియో రైట్స్ భయంకరమైన రేట్లకు అమ్మేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా బ్రో ఆల్బమ్ మీద ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్ కు కర్త..కర్మ..క్రియ అంతా తెరవెనుక త్రివిక్రమ్ నే. అందువల్ల వీరిద్దరి కాంబినేషన్ మీద గట్టి ఆశలు పెట్టుకున్నారు. కానీ వచ్చిన సాంగ్స్ ఆ రేంజ్ లో లేకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. మొన్నటికి మొన్న వచ్చిన పబ్ సాంగ్ అప్ టు ది మార్క్ లేదు. ఈ రోజు వచ్చిన డ్యూయట్ మరీ నాసిరకంగా వుంది.

దీంతో పవన్ ఫ్యాన్స్ సంగతి ఎలా వున్నా, మహేష్ ఫ్యాన్స్ నుంచి ఆందోళన ఎక్కువగా వుంది. ఎప్పటి నుంచో థమన్ ను మార్చమని వారు డిమాండ్ చేస్తున్నారు. థమన్ వర్క్ ఏదో ఒకటి వచ్చినపుడల్లా ఈ డిమాండ్ పెరుగుతోంది. థమన్ మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి, బ్రో ఆల్బమ్ గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ అదేమంత ఎఫెక్టివ్ గా లేదు.