త్రివిక్రమ్ చేయాల్సిందే మిగిలింది

గుంటూరుకారం సినిమా డ్రీమ్ రన్ అనండి లేదా పండగ రన్ అనండి అది ఈ అయిదు రోజులు నడిచింది. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే కేవలం మహేష్ బాబు చాలా యాక్టివ్ గా నటించడం, తన…

గుంటూరుకారం సినిమా డ్రీమ్ రన్ అనండి లేదా పండగ రన్ అనండి అది ఈ అయిదు రోజులు నడిచింది. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే కేవలం మహేష్ బాబు చాలా యాక్టివ్ గా నటించడం, తన గీత దాటి వచ్చి విపరీతంగా డ్యాన్స్ లు చేయడం వంటి కారణాలతోనే ఈ సినిమా ఇంత వరకు వచ్చింది.

ఇక మీదట ముందుకు వెళ్లాలంటే ఇక కంటెంట్ గురించి కాస్త గట్టిగా చెప్పాల్సి వుంటుంది. కంటెంట్ వుందా లేదా, పాతదా కొత్తదా అన్న సంగతులు పక్కన పెడితే దర్శకుడు త్రివిక్రమ్ రంగంలోకి దిగాలి.

జనాల అనుమానాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, కామెంట్ లు కావచ్చు. వీటిని తనదైన స్టయిల్ లో తిప్పి కొట్టడమో, లేదా క్లారిఫికేషన్ లు ఇవ్వడమో చేయాలి. మీడియా పిన్ పాయింట్ గా అడగాలి. త్రివిక్రమ్ డిటైల్డ్ గా చెప్పాలి.

అలా జరిగితేనే సినిమా మీద మరింత ఆసక్తి కలుగుతుంది. సినిమాను కనీసం మరో పాతిక శాతం రన్ పెంచగలిగితే బయ్యర్లు గట్టెక్కడం సంగతి అలా వుంచి నిర్మాత కు రిలీఫ్ గా వుంటుంది. కానీ అలా జరగాలంటే త్రివిక్రమ్ రంగంలోకి దిగాలి.

హీరో ఒక ఇంటర్వ్యూ వదిలారు. మహా అయితే మీడియా ముందుకు వస్తారు. అంతకన్నా చేయగలిగింది లేదు. త్రివిక్రమ్ కూడా రంగంలోకి దిగాల్సి వుంది. పైగా ఈ సినిమా విషయంలో అందరి వేళ్లూ త్రివిక్రమ్ నే చూపిస్తున్నాయి. అందుకు ఆయన బదులు చెప్పాల్సి వుంది కూడా.