టీడీపీ అవుట్ డేటెడ్…నిజమేనా..?

తెలుగుదేశం పార్టీ ఇపుడు నడి వయసులో ఉంది. ఆ పార్టీ పుట్టి నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు రాజకీయం పుట్టి యాభై ఏళ్ళు అవుతోంది. ఇపుడు…

తెలుగుదేశం పార్టీ ఇపుడు నడి వయసులో ఉంది. ఆ పార్టీ పుట్టి నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు రాజకీయం పుట్టి యాభై ఏళ్ళు అవుతోంది. ఇపుడు అంతా ట్రెండ్ మారింది. తెలుగుదేశంలో మెజారిటీ నాయకులు కూడా ఆరున్నర పదులు దాటిన వారే అన్న కామెంట్స్ ఉన్నాయి.

గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కాంగ్రెస్ ని దేశంలో చెబుతారు. అది చెప్పువడానికి ఘనమైన మాటగా ఉన్నా అందులోనే విమర్శ ఉంది. పాత కాలం పార్టీ ఈ కాలానికి కుదరని పార్టీ అని ప్రత్యర్ధులు మాట్లాడేందుకు కూడా అలా అవకాశం ఉంది. అదే నిజమని చెబుతూ బీజేపీ లాంటి పార్టీలు కాంగ్రెస్ లేని దేశాన్ని కోరుకుంటూ వచ్చాయి కూడా.

ఏపీలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా టీడీపీని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒక విధంగా విమర్శిస్తున్నారు. టీడీపీ ఆలోచనలు అన్నీ పాతకాలం నాటివి అని కొట్టిపారేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అయితే టీడీపీ మ్యానిఫేస్టోని పట్టుకుని అవుట్ డేటెడ్ అనేశారు. టీడీపీ మేనిఫెస్టో ఔట్ గ్యారంటీ వారంటీ లేని ప్రొడక్ట్ అని పంచ్ డైలాగులు పేల్చారు.

వాలంటీర్లు ఇళ్ళల్లోకి వచ్చి గొడవలు పెడుతున్నారని చెబుతున్న చంద్రబాబు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు ఆడవారిని మోసం చేస్తున్నారు అని తెలుగు మహిలా అధ్యక్షురాలు అనిత అనడం పట్ల కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలను తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు.

పవన్ కళ్యాణ్ జగన్ మీద చేస్తున్న విమర్శలను వైసీపీ మహిళా ఎమ్మెల్సీ తప్పుపట్టారు. మరోసారి ఏపీకి జగనే సీఎం అని జాతీయా మీడియా సర్వేలు చెబుతున్న వాస్తవాన్ని గుర్తించిన మీదటనే విపక్షాలలో అసహం మొదలైందని, అందుకే హద్దులు దాటి నిందలు వేస్తున్నారని ఆమె అన్నారు. 

టీడీపీ పాలనలో ఏమి చేయలేదు కాబట్టే జనాలు 2019లో తిరస్కరించారని, జన్మభూమి కమిటీల పనితీరు మీద ఎల్లో మీడియాలోనే వ్యతిరేక వార్తలు వచ్చాయన్న సంగతిని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. మీ భవిత్ష్యత్తుకు మా గ్యారంటీ అంటూ చెబుతున్న టీడీపీ ప్రోడక్ట్ కే వారంట్ లేదని వరుడు కళ్యాణి చేసిన కామెంట్స్ పసుపు నేతలకు మంటెక్కించేలాగానే ఉన్నాయి.